నిర్మాతల కష్టాలు.. 'మహర్షి' బడ్జెట్‌ ఎంత? అయిన బిజినెస్‌ ఎంత?

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు సినిమాకు ఎంత బడ్జెట్‌ పెట్టినా రికవరీ అవుతుందనే నమ్మకం నిర్మాతల్లో ఉంటుంది.

సినిమా ఫలితం ఎలా ఉన్నా కూడా బడ్జెట్‌ మాత్రం రికవరీ ఖాయం అవుతుంది.

అందుకే మహేష్‌బాబుతో సినిమా తీసే ఏ నిర్మాత అయినా కూడా బడ్జెట్‌ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.తాజాగా మహర్షి చిత్రంను దిల్‌రాజు మరియు అశ్వినీదత్‌లు కలిసి నిర్మించారు.

ఈ చిత్రంను మొదట 80 కోట్లతో అనుకున్నారు.ఆ తర్వాత అది కాస్త 100 కోట్లకు పెరిగింది.

రీ షూట్‌లు, షూటింగ్‌ ఆలస్యం వంటి కారణాల వల్ల సినిమా ఏకంగా 140 కోట్లకు బడ్జెట్‌ పెరిగిందట.సినిమా నిర్మాణంకు మరియు ప్రమోషన్‌కు కలిపి మొత్తంగా మహర్షి నిర్మాతలు 140 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

Advertisement

ఇలాంటి సమయంలోనే ఈ చిత్రంను అన్ని ఏరియాల్లో మరియు ఇతర రైట్స్‌ను కలిపి 140 కోట్లకు అమ్మాలని వీరు ప్రయత్నించారు.కాని అది సాధ్యం కావడం లేదు.

ఎంత ప్రయత్నించినా కూడా 120 నుండి 125 కోట్లకు కొనుగోలు చేసేందుకు బయ్యర్లు ముందుకు రావడం లేదు.దాంతో నిర్మాతలు 20 కోట్ల రిస్క్‌తోనే సినిమాను విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చిందట.

సినిమా విడుదలై పాజిటివ్‌ టాక్‌ దక్కించుకుంటే ఆ 20 కోట్లు వస్తాయి, లేదంటే ఆ 20 కోట్ల రూపాయలు నష్టాలే అన్నట్లుగా సినీ వర్గాల వారు అంటున్నారు.మహేష్‌ బాబు కెరీర్‌లో 25వ చిత్రం అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రంను వంశీ పైడిపల్లి తెరకెక్కించే ఉద్దేశ్యంతో ఏకంగా 140 కోట్ల రూపాయలను ఖర్చు చేశాడు.ఖర్చు అయితే చేశారు కాని ఇప్పుడు నిర్మాతలు ఆందోళనలో ఉన్నారు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
భర్తతో దిగిన ఫోటోలను డిలీట్ చేయాలని కోరిన కత్రినా కైఫ్.. అసలేం జరిగిందంటే?

నిర్మాతలు ప్రస్తుతం కష్టాల్లో ఉన్నారు, వారి కష్టాలు సినిమా విడుదలయ్యే రోజు అయిన మే 9న తేలిపోనున్నాయి.

Advertisement

తాజా వార్తలు