మహా సీఎంగా ఉద్దవ్‌ థాక్రే ప్రమాణ స్వీకారం

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా అయిదు రోజుల క్రితం ప్రమాణ స్వీకారం చేసిన పడ్నవీస్‌ మూడు రోజులకే రాజీనామా చేయడంతో కొత్త ముఖ్యమంత్రిగా ఉద్దవ్‌ థాక్రే ప్రమాణ స్వీకారం చేశాడు.

మహారాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా ఉద్దవ్‌ ముంబయిలోని మహారాజా చత్రపతి శివాజీ పార్క్‌లో ప్రమాణ స్వీకారం చేశాడు.

చత్రపతి శివాజీకి మొదట నివాళ్లు అర్పించిన ఉద్దవ్‌ ఆ తర్వాత తల్లిదండ్రులను స్మరించుకుని సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.ఉద్దవ్‌ థాక్రేతో పాటు మంత్రులుగా ఆరుగురు ప్రమాణ స్వీకారం చేశారు.

శివసేన నుండి ఇద్దరు, ఎన్సీపీ నుండి ఇద్దరు, కాంగ్రెస్‌ నుండి ఇద్దరు.మొత్తం ఆరుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.

బల పరీక్ష పూర్తి అయిన తర్వాత మరోసారి మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉంది.అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారు ఇప్పుడు మంత్రి పదవులు ద్కకుంటే పార్టీ మారే అవకాశం ఉందనే ఉద్దేశ్యంతో ఇప్పుడే మంత్రులను పూర్తి స్థాయిలో తీసుకోలేదంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
ఇంతకీ.. కుప్పంలో బాబు గారి పరిస్థితేంటి ? 

తాజా వార్తలు