టిక్ టాక్ పై వెంటనే యాక్షన్ తీసుకోండి! కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు

సోషల్ మీడియాలో యాప్స్ చేతిలోకి వచ్చిన తర్వాత అశ్లీలత, క్రైమ్ వంటివి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అని చెప్పాలి.

సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ప్రయత్నం యువతని తప్పుదారి పట్టిస్తూ ఉంటే, అందులో ఉండే గేమ్స్ వారి ఆలోచనలని ప్రభావితం చేస్తూ, క్రైమ్ ని ప్రోత్సహించే విధంగా, అలాగే తమని తాము చంపుకునే విధంగా మానసిక ఒత్తిళ్ళకి కారణం అవుతున్నాయి అని చెప్పాలి.

దీంతో సోషల్ మీడియా నియంత్రణ మీద ఎప్పటి నుంచో దేశంలో పెద్ద చర్చ నడుస్తుంది.ప్రస్తుతం పబ్ జి తర్వాత సోషల్ మీడియాలో యువత ఎక్కువగా వాడే యాప్ టిక్ టాక్.

యువతలో ప్రజా ఆదరణ పొందిన ఈ యాప్ ను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మద్రాస్‌ హైకోర్ట్‌ ఆదేశించింది.ఈ యాప్‌తో అశ్లీల కంటెంట్‌ వ్యాప్తి అవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ చైనాకు చెందిన ఈ వీడియో షేరింగ్‌ మొబైల్‌ యాప్‌ డౌన్‌లోడ్‌పై నిషేధం విధించాలని ఆదేశిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

అలాగే టిక్‌టాక్‌ యాప్‌తో రూపొందిన వీడియోలను ప్రసారం చేయరాదని బెంచ్‌ మీడియా సంస్థలను కూడా కోర్టు ఆదేశించింది.ప్రపంచంలో అత్యధికంగా ఇండియాలోనే టిక్ టాక్ యాప్ ని ప్రజలు ఉపయోగిస్తున్నారు.ఇలాంటి వేళ హై కోర్ట్ ఆదేశాలని కేంద్ర ప్రభుత్వం ఎంత వరకు పరిగణలోకి తీసుకుంటుంది చూడాలి.

Advertisement
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు