విషాదం : కాంగ్రెస్ ఎమ్యెల్యే కూతరు ఆత్మహత్య....

ప్రస్తుత కాలంలో కొందరు ప్రతి విషయానికి ఆత్మహత్య సమాధానంగా చేసుకుంటూ బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు.

తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఓ ఎమ్మెల్యే కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శివపూర్ జిల్లాకు చెందినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సురేష్ దక్కడ్ కూతురు జ్యోతికి ఇటీవలే రాజస్థాన్ రాష్ట్రానికి చెందినటువంటి ఓ వైద్య విభాగంలో పని చేస్తున్న జై సింగ్  అనే ఉద్యోగితో వివాహం అయింది.అయితే మొదట్లో వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.

అయితే ఏమైందో ఏమో కానీ ఉన్నట్లుండి నిన్నటి రోజున రాత్రి అందరూ పడుకున్న సమయంలో జ్యోతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.ఈ విషయం ఒక్కసారిగా రాజస్థాన్ రాష్ట్రంలో కలకలం రేపింది.

అయితే కుటుంబ సభ్యుల మంచి సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలో ఉన్నటువంటి ఆస్పత్రికి తరలించారు.అంతేకాక కుటుంబ సభ్యులు తెలిపిన టువంటి వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో భాగంగా జ్యోతి భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement
బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

తాజా వార్తలు