కళ్లు లేకపోయినా మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ పరీక్షలో జాబ్.. ఈమె సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!

కళ్లు లేని వాళ్లకు నిత్య జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే కళ్లు లేకపోయినా తమ టాలెంట్ తో సక్సెస్ సాధిస్తూ చాలామంది ప్రశంసలు అందుకుంటున్నారు.

మాలా( Mala ) అనే యువతి సక్సెస్ స్టోరీ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.మహారాష్ట్ర రాష్ట్రంలోని జల్గావ్ రైల్వే స్టేషన్ ( Jalgaon Railway Station )లో 25 సంవత్సరాల క్రితం చెత్తకుండీలో ఒక పసిపాప దొరికింది.

రెండు కళ్లు లేకపోవడం వల్లే ఆ పసిపాపను అక్కడ వదిలేశారని కామెంట్లు వ్యక్తమయ్యాయి.పోలీసులు ఎంత ప్రయత్నించినా ఆ చిన్నారిని వదిలిపెట్టిన తల్లీదండ్రుల జాడ మాత్రం తెలియలేదు.

పోలీసులు ఆ పాపను రిమాండ్ హోమ్ కు తరలించారు.సాధారణంగా అనాథల జీవితాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Advertisement

ఆ పాప అంధురాలు కావడంతో ఆ పాప పరిస్థితి మరింత దయనీయంగా ఉంది.

సామాజిక కార్యకర్త, పద్మశ్రీ అవార్డ్ గ్రహీత శంకర్ బాబా పాపల్కర్ ( Padma Shri awardee Shankar Baba Papalkar )ఆ పాపకు మాలా అనే పేరు పెట్టి పాపల్కర్ అనే తన ఇంటి పేరును సైతం ఇచ్చేశారు.అమరావతి యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన మాలా నాకు దేవుడు అమ్మా నాన్నలను చూసే అవకాశం ఇవ్వలేదని కానీ అంతకంటే గొప్పగా చూసే మంచి మనుషుల మధ్య పెరిగే అవకాశం ఇచ్చాడని మాలా వెల్లడించారు.

మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాసి మాలా సెక్రటేరియట్ లో క్లర్క్, టైపిస్ట్ జాబ్ ( Clerk, Typist Job in Secretariat )సంపాదించుకున్నారు.తాను ఇంతటితో ఆగిపోనని సివిల్స్ రాసి ఐఏఎస్ సాధించాలనేది నా కల అని ఆమె చెబుతున్నారు.ఆ పరీక్ష పూర్తి అయితే నేను నాలాంటి వారికి అండగా మాలా వెల్లడించారు.

మాలా వెల్లడించిన విషయాలు వైరల్ అవుతున్నాయి.మాలా టాలెంట్ ను నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఫ్లైట్ ఆలస్యం అయిందని స్నాక్స్, వాటర్ ఉచితంగా ఇచ్చిన ఇండిగో..??
Advertisement

తాజా వార్తలు