మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలు జరిగి ఏడాది పూర్తి అయింది.గత ఏడాది చాలా నాటకీయ పరిణామాల నేపథ్యం లో జరిగిన మా ఎన్నికలు ఒక సార్వత్రిక ఎన్నికలను తలపించాయి అనడం లో సందేహం లేదు.
మంచు విష్ణు ప్రత్యర్థి అయిన ప్రకాష్ రాజ్ లు హోరా హోరీగా పోరాడారు.మంచు విష్ణు టీం ప్రకాష్ రాజ్ ను స్థానికేతరుడు అంటూ ప్రచారం చేయడం తో ఆయన ఓడి పోయారు.
మంచు విష్ణు గెలిచి సత్తా చాటాడు.మంచు విష్ణు గెలిచిన కొన్ని రోజుల్లోనే మా భవనం కు శంకుస్థాపన చేస్తానంటూ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
మా అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలిచి సంవత్సరం పూర్తయిన ఇప్పటి వరకు కనీసం అధ్యక్ష పదవికి న్యాయం చేయలేదు అంటూ ప్రత్యర్ధులు ఆరోపిస్తున్నారు.
మా బిల్డింగ్ విషయం లో తాను ఏదో చేస్తానంటూ బిల్డప్ ఇచ్చిన మంచు విష్ణు ఇప్పుడు ఆ విషయం లో చేతులెత్తేశాడు.హేమా హేమీలే మా బిల్డింగ్ నిర్మాణం చేయలేక పోయారు, కానీ తాను మాత్రం మా బిల్డింగ్ నిర్మాణం చేసి చూపిస్తానంటూ సవాల్ విసిరాడు.కానీ ఇప్పటి వరకు అందుకు సంబంధించి ఏ పనులు మొదలు కాలేదు.
అసలు కనీసం చర్చలు జరిగిన దాఖలాలు కూడా లేవు.మా అధ్యక్షుడిగా ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో సంబరాలు జరుపుకుంటున్న మంచు విష్ణు ఏం చేశాడో క్లారిటీ ఇవ్వాలి అంటూ ప్రత్యర్ధులు డిమాండ్ చేస్తున్నారు.
ఏం చేయకుండానే ఇలా సంబరాలు జరుపుకోవడం ఏంటి అంటూ వాళ్లు ప్రశ్నిస్తున్నారు.చేసిందేమీ లేదు, కానీ వార్షికోత్సవాల పేరు తో మా యొక్క నిధులు ఖర్చు చేస్తున్నారని.
మీరు సాధించిన విజయాలు ఏంటి.సాగించిన కార్యక్రమాలు ఏంటి అంటూ ప్రకాష్ రాజు ప్యానెల్ లో గతంలో పోటీ చేసిన వారు ప్రశ్నిస్తున్నారు.
ఈ విషయమై మంచు విష్ణు ఏం సమాధానం చెబుతాడో చూడాలి.