మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది.ప్రచారం చేసేందుకు జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు రంగంలోకి దిగారు.
ఈ నేపథ్యంలో ఈనెల 29న మునుగోడులో భారీ బహిరంగ సభకు బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం.అంతేకాకుండా బహిరంగ సభకు బీజేపీ అగ్రనేత అమిత్ షాను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుందని తెలుస్తోంది.
మునుగోడులో ప్రచారాన్ని రెండు విడతల్లో నిర్వహించేలా పార్టీ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు.ప్రతి మూడు గ్రామాలకు ఒక యూనిట్ గా చేసి ప్రచారం చేయనున్నారు.
రేపటి నుంచి ప్రచారంలో రాష్ట్ర నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్ తదితరులు రంగంలోకి దిగనున్నారు.