మాస్ మహారాజా కెరీర్ లో ఎప్పుడు జెట్ స్పీడ్ తోనే దూసుకు పోతాడు.ఏడాదికి మూడు నాలుగు సినిమాలను పక్కాగా విడుదల చేస్తాడు.
అయితే కరోనా వల్ల గత రెండు సంవత్సరాలు స్పీడ్ తగ్గించాడు.ఇక మళ్ళీ ఈ మధ్యనే వరుస సినిమాలు ప్రకటిస్తూ మళ్ళీ పాత స్పీడ్ ను కంటిన్యూ చేస్తున్నాడు.
ఈయన గ్యాప్ లేకుండా సినిమాలు అనౌన్స్ చేసి అంతే వేగంగా షూటింగ్ కూడా పూర్తి చేస్తున్నాడు.
ఇటీవలే రమేష్ వర్మ దర్శకత్వంలో చేసిన ఖిలాడీ సినిమా రిలీజ్ అయ్యింది.
కానీ అను కున్నంత హిట్ అయితే అవ్వలేదు.ఆ తర్వాత రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకు వెళ్ళాడు.
శరత్ మండవ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇక ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే మరొక సినిమాను ప్రకటించాడు.
త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ ధమాకా సినిమా చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించాడు.
ఈ సినిమాను కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమాలో రవితేజ కు జోడీగా పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల నటిస్తుంది.నిన్న వాలెంటెన్స్ డే సందర్భంగా శ్రీలీల, రవితేజ కలిసి ఉన్న పోస్టర్ కూడా రిలీజ్ చేసారు.ఈ ఫస్ట్ లుక్ బాగానే ఆకట్టుకుంది.ఈ సినిమాలో కూడా రవితేజ డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నాడు.తాజాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
ఈ సినిమాలో రవితేజ లెక్చరర్ పాత్రలో నటిస్తున్నాడు.అలాగే శ్రీలీల స్టూడెంట్ పాత్రలో కనిపించనుందట.లెక్చరర్ తో ప్రేమలో పడే పాత్రలో ఈమె కనిపించ బోతుందని తెలుస్తుంది.
అలాగే ఈ సినిమాలో లెక్చరర్ లవ్ ట్రాక్ ఈ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని ఈ ట్రాక్ ను డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కిస్తున్నాడని టాక్ నడుస్తుంది.ముఖ్యంగా రవితేజ పాత్ర చాలా కొత్తగా ఉంటుందట.