7/G Brindavan Colony : 7/G బృందావన్ కాలనీ సినిమా ఇప్పుడు తీస్తే ఖచ్చితంగా ఫ్లాప్ చేస్తారు ..!

ప్రేమంటేనే ఈ సృష్టిలో ఒక అద్భుతం….అది ఒక మనిషి యొక్క జీవితాన్ని ఎక్కడికైనా తీసుకెళ్లగలదు.

 Love Stories Changed In These 2 Decades-TeluguStop.com

అది ఏ గమ్యానికి చేరుస్తుందో ఎలాంటి మలుపులు తిప్పుతుందో ఎవ్వరు ఊహించలేరు.ఆ ప్రేమను అనుభవించే వాడికి తప్ప బయట వారు అర్థం చేసుకోలేరు అయితే మనకు సంబంధించిన అంతవరకు ప్రేమ గురించి సినిమాల్లో చూపించినంత గొప్పగా బయట ఎక్కడా చూపించలేరు.

అందుకు ఉదాహరణే 7/G బృందావన్ కాలనీ చిత్రం.ప్రేమ ఎలా ఉంటుందో చాలామంది ఈ సినిమాను చూసి నేర్చుకున్నారు ఇప్పటి యూత్ కి అర్థం అవుతుందో లేదో కానీ ఈ చిత్రంలో మనం చూసిన నిజమైన అద్భుతం ప్రేమ మాత్రమే.7/G బృందావన్ కాలనీ( 7G Brindavana Colony ) సినిమా వచ్చి రెండు దశాబ్దాలు గడిచిపోయింది.

Telugu Chandra Mohan, Love, Ravi Krishna, Sonia Agarwal, Suman Setty, Tollywood-

అప్పుడు ఈ సినిమాకు ఉన్న ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ మరే సినిమాకు లేదంటే ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.అప్పట్లో లాగా ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు.ఎప్పుడైతే మనిషి చేతికి మొబైల్ ఫోన్ వచ్చిందో అప్పుడే నిజమైన ప్రేమ కథలకు కాలం చెల్లిపోయింది.

ఇప్పుడు ప్రేమంటేనే ఒక బూతుల తయారయ్యింది కానీ ఈ 20 ఏళ్ళు వెనక్కి వెళితే ప్రేమ కథలు మైమర్చిపోయే విధంగా ఉండేవి.ఒకరికొకరు లవ్ లెటర్స్ ఇచ్చుకునే వాళ్ళు.

గిఫ్ట్స్ ని ఎక్స్చేంజ్ చేసుకునేవారు.స్నేహితులంతా కూడా పోస్ట్ మ్యాన్ అవతారం ఎత్తాల్సి వచ్చేది.

అప్పట్లో ప్రేమ స్వచ్ఛమైనది, కల్మషం లేనిది, కన్నీళ్లు కూడా ఎంతో స్వచ్ఛమైనవి.ప్రేమ అంటేనే అత్యంత స్వచ్ఛమైన విషయమని మనం నమ్మే వాళ్ళం.

Telugu Chandra Mohan, Love, Ravi Krishna, Sonia Agarwal, Suman Setty, Tollywood-

కానీ అప్పుడు చూసిన ఆ ఎంగేజింగ్ సీన్స్ అన్నీ కూడా ఇప్పుడు యూత్ కి బోర్ అనిపించవచ్చు.అప్పటికి ఇంకా పుట్టని వారు సైతం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమా చూస్తే నాకు నిద్ర వస్తుంది, నీరసం వస్తుంది అని ట్రోల్ చేసేవాళ్లే.అప్పట్లో థియేటర్ కి సినిమా వస్తే చూసేవారు లేదంటే ఒక ఐదారు ఏళ్ళకి టీవీలో వస్తే ఆ సినిమాని యూత్ ఎంతో ఎంజాయ్ చేసేవారు.అందుకే 7/G బృందావన్ కాలనీ సినిమా ఒక అద్భుతం అమోఘం అని చెప్పవచ్చు ఆ సినిమాలో చంద్రమోహన్ ( Chandra Mohan )నటిస్తుంటే కన్నీళ్లు వస్తాయి, సుమన్ శెట్టి( Suman Setty )ని చూడగానే కడుపుబ్బా నవ్విస్తుంది.

ఎవరు అవునన్నా కాదన్నా ఇప్పుడు ఆ ప్రేమలు లేవు ఎమోషన్ కూడా లేదు అలాంటి కామెడీ కూడా పండించలేరు.దానిపై ప్రపంచీకరణ బాగా జరిగిపోయింది.ఇప్పుడు ఈ చిత్రం విడుదలయితే ఖచ్చితంగా క్లైమాక్స్ బాగా లేదంటూ సినిమాని పక్కన పడేస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube