నిజజీవితంలో ప్రేమ ఎప్పటికీ ఉంటుంది.. అదితి రావు కామెంట్స్ వైరల్!

అదితి రావు హైదరి గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపిస్తున్న పేర్లలో ఒకటి.

ఈమె తన భర్తకు విడాకులు ఇచ్చి నటుడు సిద్దార్థ్ ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇలా సిద్దార్థ్ డేటింగ్ రూమర్స్ ద్వారా ఈమె పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.ఇక తాజాగా అదితి నటించిన డివైడెడ్ బై బ్లడ్ అనే వెబ్ సిరీస్ మొదటి సీజన్ నేడు జీ 5 లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇందులో ఈమె అనార్కలి పాత్రను పోషించగా.నసీరుద్దీన్ షా కీలకపాత్రలో కనిపించనున్నారు.

ఇక ఈ వెబ్ సీరీస్ నేడు విడుదల కానున్న నేపథ్యంలో ఈ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా అదితి ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్య్వూలో అదితి మాట్లాడుతూ.రియల్ లైఫ్ లవ్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.అనార్కలి లాంటి ప్రేమను తాను చాలా నమ్ముతానని ఇలాంటి కథ.సరికొత్త పాత్ర పట్ల తాను ఎంతో ఉత్సాహంగా ఉన్నానని తెలిపారు.మేము మొఘల్‏ల కథతో సాంస్కృతికంగా అనుసంధానించబడ్డాము.

Advertisement

ఇక్కడ ఎప్పటికీ నమ్మలేని ప్రేమ కథ ఉంటుందని ఈమె తెలిపారు.

ఇకపోతే కొందరు ఈ ప్రేమను నమ్మడం లేదని అలాంటి వారితో కలిసి తాను ప్రయాణం చేశానని తెలిపారు.ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా అదితిని ప్రశ్నిస్తూ నిజజీవితంలో కూడా అనార్కలి వంటి నిజమైన ప్రేమ ఉంటుందా అని ఈమెను ప్రశ్నించగా ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ నిజ జీవితంలో కూడా అనార్కలి లాంటి నిజమైన ప్రేమ ఉందని తాను ఇప్పటికీ నమ్ముతానంటూ ఈ సందర్భంగా అదితి రియల్ లైఫ్ లవ్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు