ల‌వ్ అండ్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ `నారి నారి నడుమ మురారి` ప్రారంభం

సుప్రీమ్ మూవీస్ అధినేత `రాజు హర్వాణి` సమర్పణలో చక్ర ఇన్ఫోటైన్మెంట్ ప‌తాకంపై వెంకటరత్నం నిర్మాతగా, జివికే కథ- స్క్రీన్ ప్లే – మాటలు – దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న‌ నూత‌న చిత్రం `నారి నారి నడుమ మురారి`.సీనియ‌ర్ న‌టి ఆమ‌ని మేన కోడ‌లు హృతిక హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంతో అభిలాష్ బండారి హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.

 Love And Suspense Thriller `nari Nari Naduma Murari` Begins , Nari Nari Naduma M-TeluguStop.com

ప్రముఖ హీరోయిన్ అతిథి పాత్రలో నటిస్తోంది.ల‌వ్ అండ్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం టైటిల్ పోస్ట‌ర్‌ను ఏప్రిల్ 25న విడుద‌ల చేశారు.

ఆహ్లాద‌క‌రంగా ఉన్న ఈ టైటిల్‌పోస్ట‌ర్ కి సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.

వినూత్న‌మైన క‌థ క‌థనాల‌తో ఒక డిఫ‌రెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ గా క్రిస్పీ స్క్రీన్ ప్లేతో ఈ చిత్రం రూపొందుతుందని ద‌ర్శ‌కుడు జీవికే తెలియ‌జేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ – ప్ర‌స్తుతం నారి నారి నడుమ మురారి మ్యూజిక్ సిట్టింగ్స్ జ‌రుగుతున్నాయి.పాట‌లు చాలా బాగా వ‌చ్చాయి.జూన్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించి జులై, ఆగ‌స్ట్ నెల‌ల్లో యానం, అమ‌లాపురం, వైజాగ్‌, లంబ‌సింగి, హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లోని అంద‌మైన లోకెష‌న్స్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుప‌నున్నాం.జె.

ప్ర‌భాక‌ర్ రెడ్డి గారు డిఓపిగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా సింధు కే ప్రసాద్ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉండేలా మంచి స్క్రిప్ట్ కుదిరింది.

సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌గా త‌ప్ప‌కుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది“ అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube