చోద్యం : ఎండలకు చెమటతో తడిసి ముద్దవుతున్న విఘ్నేషుడు

గతంలో ఎప్పుడు లేనంతగా దక్షిణ భారత దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి.హాఫ్‌ సెంచరీకి కాస్త అటు ఇటుగా ఎండలు కొడుతున్నాయి.

రికార్డు స్థాయిలో ఎండలు కొడుతున్న నేపథ్యంలో జనలు ఉక్క పోతతో తడిసి పోతున్నారు.పట్టణాల్లో జనాలు ఉదయం 10 గంటలు దాటితే బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో జనాలు తమ దైనందిత జీవితంను కూడా పక్కకు పెట్టాల్సి వస్తుంది.ఈ ఎండలు కేవలం మనుషులకు మాత్రమే కాకుండా దేవుళ్లను కూడా ఇబ్బంది పెడుతున్నాయి.

దేవాలయాల్లో దర్శనం కోసం వచ్చే భక్తులకు ఏసీలు, కూలర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది.కాని కొన్ని దేవాలయాల్లో దేవుళ్లకు ఏసీలు కూలర్లు పెట్టినట్లుగా మనం ఇంతకు ముందు వార్తల్లో చూశాం.దేవుళ్లకు ఏసీలు కూలర్లు ఎందుకు అంటూ కొందరు విమర్శలు చేశారు.

Advertisement

దేవుళ్లకు ఏమైనా ఉడక పోస్తుందా అంటూ కొందరు ఎద్దేవ చేశారు.తాజాగా బీహార్‌లోని వినాయకుడు అలా కామెంట్స్‌ చేసిన వారికి ట్విస్ట్‌ ఇచ్చాడు.

అక్కడ వినాయకుడు చెమటతో తడిసి ముద్ద అవుతున్నాడు.బీహార్‌లోని పట్నాకు సమీపంలోని రామశిల అనే ప్రాంతంలోని గుడిలో వినాయక ప్రతిమ ఉంది.

ఆ ప్రతిమ గత కొన్ని రోజులుగా మద్యాహ్న సమయంలో తడిసి ముద్ద అవుతోంది.దాంతో స్థానికులు పెద్ద ఎత్తున వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటున్నారు.

ఈ సమయంలోనే విషయం ఇతర ప్రాంతాలకు కూడా తెలియడంతో పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారు.వినాయకుడు విగ్రహంపై తేమ పట్టుకుంటే క్లీయర్‌గా తెలుస్తోంది.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఆ విగ్రహంపై పల్చటి గుడ్డ ఏదైనా కప్పితే అయిదు నిమిషాల్లో పూర్తిగా తడిసి పోతుంది.

Advertisement

ఈ విషయంపై శాస్త్రవేత్తలు స్పందిస్తూ విగ్రహం ప్రత్యేకమైన శిలతో చేయడం జరిగింది.ఆ శిల బాగా ఎండుకు తేమను బయటకు పంపిస్తుంది.కొన్ని ప్రాంతాల్లో ఈ శిలలు అంటే ఉత్తి రాళ్లు కూడా చెమటతో నిండి పోతాయని అంటున్నారు.

శాస్త్రవేత్తల వాదన పట్టించుకోని స్థానికులు ఈ వినాయకుడు చాలా స్పెషల్‌ అంటూ మొక్కుకుంటున్నారు.

తాజా వార్తలు