మనందరికీ గుండె ఎక్కడ ఉంటుంది.? అది అందరికీ తెలిసిన విషయమే ఛాతీ ఎడమవైపు ఉంటుందని ఎవరైనా చెప్పే సమాధానం ఇట్టే ఇచ్చేస్తారు.కాకపోతే ఓ మహిళకు మాత్రం తన శరీరం లోపల ఆమె గుండె ఉండదు.ఆమెతో పాటు ఉంటున్న బ్యాగులో ఆవిడ గుండె ఉంటుంది.ఆమె ఎక్కడికి వెళ్లినా తన గుండె ఉన్న బ్యాగ్ ను తనతో పాటు కూడా తీసుకు వెళ్లాల్సిందే.అసలు గుండె ఏంటి.? ఆ గుండెను బ్యాగు లో పెట్టడం ఏంటి అని ఆలోచిస్తున్నారా.? అవునండి.! మీరు విన్నది నిజమే.మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే…
లండన్ నగరానికి చెందిన సెల్వా హుస్సేన్.అనే 39 సంవత్సరాల మహిళకు ఈ పరిస్థితి నెలకొంది.ఈవిడ భర్త పేరు ఏఐ.ఈమెకు ఐదు సంవత్సరాల కొడుకు, సంవత్సరన్నర నెలల కూతురు ఉన్నారు.అయితే ఇది వరకు కాలంలో ఆవిడ కారులో ప్రయాణం చేస్తున్న సమయానికి ఆమెకు తీవ్రమైన గుండె నొప్పి రావడంతో పాటు అనేక శ్వాసకోశ ఇబ్బందులు ఏర్పడ్డాయి.దీంతో వెంటనే వారి ఫ్యామిలీ డాక్టర్ వద్దకు వెళ్లగా అక్కడ పూర్తిగా శ్వాస తీసుకొలేని పరిస్థితి ఏర్పడింది.
దీంతో హుటాహుటిన ఆవిడకు చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.ఆమె వ్యాధి నిర్ధారణ చేసేందుకు చేసిన పరీక్షలలో ఓ దారుణమైన విషయం బయటపడింది.అది ఏంటంటే.ఆవిడకు తీవ్రమైన హార్ట్ ఫెయిల్యూర్ సమస్య ఉందని వైద్యులు తేల్చారు.
దీంతో ఆవిడ వెంటనే ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన హేర్ ఫీల్డ్ ఆసుపత్రిలో చేరారు.అక్కడ ఆవిడ ప్రాణాలు కాపాడడానికి గుండె సంబంధించిన వైద్యులు ఎంతో శ్రమించారు.
ఆవిడ గుండె పనిచేయదని నిర్ధారణకు వచ్చిన వైద్యులు ఆవిడకు కృతిమ గుండెను ఆమర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది.దీంతో ఆవిడ భర్త అంగీకారంతో ఆపరేషన్ చేసారు.
ఆపరేషన్లో ఆమెకు తన గుండెను శరీరం నుంచి తొలగించి కృతిమ హృదయాన్ని ఏర్పాటు చేశారు.

అయితే ఈ కృత్రిమ గుండెను శరీరం లో అమర్చడం కాకుండా బ్యాగులో పెట్టేలా చేశారు లండన్ వైద్యులు.ఆ బ్యాగ్ లో మొత్తం రెండు బ్యాటరీలు, ఓ మోటార్ పంపు ఉంటాయి.ఆ బ్యాగు నుండి వచ్చే 2 పైపులు రెండువైపులా ఛాతి భాగం నుంచి శరీరంలోకి వెళ్ళాయి.
బ్యాగ్ లోని మోటార్ సహాయంతో శరీరంలోపల అమర్చబడిన రెండు బెలున్స్ కు నిరంతరం పంప్ చేస్తూ ఉంటుంది.అవి ఎలా అంటే మన గుండెల్లో ఉండే గుండె గదుల వలె పనిచేస్తాయి.
శరీరానికి మొత్తం అవసరమైన రక్తం ఇక్కడ నుంచి పంపు చేయబడుతుంది.ఇలా ఆవిడకు వైద్యులు ఒక నిమిషానికి 138 సార్లు గుండె కొట్టుకునేలా అమర్చారు.
అందుకే ఆవిడ తన గుండెను తనతోపాటే బ్యాగులో మోస్తూ ఉంటుంది.