బీజేపీ నేత బండి సంజయ్ నీ.పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత కస్టడీ నుండి.
లోక్ సభ స్పీకర్ కు లెటర్ రాయడం తెలిసిందే.ఆ లెటర్లో.
పార్లమెంటు సభ్యుడు అయిన నాకు సిపి సత్యనారాయణ.కనీస గౌరవం ఇవ్వటం లేదని అదే విధంగా కరీంనగర్ పోలీసులు అనుచితంగా వ్యవహరిస్తూ బలవంతంగా అరెస్టు చేసినట్లు… తన అక్రమ అరెస్టుపై సిపి పై చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ క్రమంలో బండి సంజయ్ రాసిన లెటర్ పట్ల.లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించడం జరిగింది.
బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని హోంశాఖ కార్యదర్శినీ కోరారు.దీంతో స్పీకర్ ఆదేశాలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి రియాక్ట్ కావడం జరిగింది.బండి సంజయ్ అరెస్ట్ వివరాలు అందజేయాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ అదే రీతిలో డీజీపీ లను ఆదేశించడం జరిగింది.ఉపాధ్యాయుల బదిలీలు మరియు జీవో 317 మార్పులపై బండి సంజయ్ కరీంనగర్ బిజెపి కార్యాలయంలో జాగరణ దీక్ష చేపట్టారు.
ఈ తరుణంలో కరోనా నిబంధనల ఉల్లంఘన, పోలీసులు విధులకు ఆటంకం కలిగించటం కారణంగా బండి సంజయ్ తో పాటు మొత్తం 12 మంది పై పోలీసులు కేసులు నమోదు చేశారు.