టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh )”యువగళం” పాదయాత్ర మళ్లీ ప్రారంభం కాబోతోంది.నవంబర్ 27వ తారీకు నుంచి లోకేష్ పాదయాత్ర మొదలు కాబోతున్నట్లు మాజీమంత్రి ప్రతిపాటి పుల్లారావు స్పష్టం చేయడం జరిగింది.
కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడ నుంచి యాత్ర ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 18 రోజులపాటు లోకేష్ “యువగళం” పాదయాత్ర సాగుతుందని.
పేర్కొన్నారు.ఈ యాత్రలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమ అజెండా అని స్పష్టం చేశారు.
సెప్టెంబర్ నెలలో చంద్రబాబు అరెస్ట్( Chandrababu arrest ) అయినా సమయంలో లోకేష్ పాదయాత్ర( Lokesh Padayatra ) ఆపేయడం జరిగింది.ఆ సమయంలో చంద్రబాబుకి బెయిల్ తీసుకురావడానికి లోకేష్ ఎంతో శ్రమించారు.
ఈ క్రమంలో ఢిల్లీలో రెండు వారాలపాటు కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో మంతనాలు జరిపారు.ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం ఏపీ హైకోర్టు చంద్రబాబుకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడం జరిగింది.
దీంతో నవంబర్ 29 నుండి రాజకీయంగా చంద్రబాబు బిజీ కాబోతున్నారు.ఈ క్రమంలో ముందుగానే లోకేష్ తన పాదయాత్ర స్టార్ట్ చేయడానికి రెడీ కావడంతో తెలుగుదేశం పార్టీ క్యాడర్ లో జోష్ నెలకొంది.208 రోజులు దాదాపు 2000 కిలోమీటర్లకు పైగా లోకేష్ పాదయాత్ర చేయడం జరిగింది.







