జగన్ కి లెటర్ రాసిన లోకేష్..!!

ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వైయస్ జగన్ కి లోకేష్ లెటర్ రాశారు.పోలవరం ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన పోలవరం నిర్వాసితుల విషయంలో.

ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు.పోలవరం నిర్వాసితులు దయనీయ పరిస్థితిలో ఉన్నారని చెప్పుకొచ్చారు.

వారి సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఎం జగన్ కి లెటర్ రాశారు.గతంలో ప్రతి ఎకరాకు 19 లక్షలు ఇస్తామని ఇప్పుడు పది లక్షలు ఇస్తామని మాట మార్చటం దారుణమని పేర్కొన్నారు.

భూమిలేని వారికి పది లక్షల ప్యాకేజీ ఇస్తామని, వలస వెళ్లిన వారికి కూడా ప్యాకేజీ అమలు చేస్తామని, భూమి కోల్పోయిన నిర్వాసితులకు భూమి, పోడు భూమి అయితే పట్టా భూమి.ఇవ్వటం జరుగుతుందని హామీ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు.

Advertisement

అయితే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం నిర్వాసితులకు సంబంధించి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని లోకేష్ విమర్శించారు.ఎకరానికి 1.15 లక్షల పరిహారం ఇచ్చిన భూములకు .ఐదు లక్షలు ఇస్తానని 18 సంవత్సరాలు నిండిన వారికి పరిహారం ప్యాకేజీ ఇస్తామని, దాదాపు 25 రకాల సదుపాయాలతో నిర్వాసితులు అందరికీ ప్రత్యేకంగా కాలనీలు కూడా నిర్మిస్తామని 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించే విధంగా.అప్పట్లో హామీ ఇచ్చారని బహిరంగ సభలో కూడా ప్రకటించారని వాటిని వెంటనే నెరవేర్చాలని సీఎం జగన్ ని లేఖలో లోకేష్ నిలదీశారు.

కడప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు