చంద్రబాబు అరెస్టు విషయంలో కేంద్రం పాత్ర పై లోకేష్ సంచలన వ్యాఖ్యలు..!!

నేడు చంద్రబాబుతో రాజమండ్రి జైలులో ములాఖత్ ద్వారా నారా లోకేష్, భువనేశ్వరి, నారా బ్రాహ్మణి( Nara Lokesh, Bhuvaneshwari, Nara Brahmani ) కలుసుకున్నారు.

అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

కాగా చంద్రబాబు అరెస్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం పాత్రపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.దీనికి లోకేష్ సమాధానం ఇస్తూ.

"నాకు తెలిసినంతవరకు ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం హస్తం ఉందనటానికి ఎలాంటి ఆధారాలు లేవు.ఊహాగానాలపై స్పందించాల్సిన అవసరం లేదు.

ఆధారాలు ఉంటే నేనే స్పందిస్తానని తెలియజేశారు.ఎలాగైతే ఈ కేసులో తాము తప్పు చేయలేదని బలంగా చెబుతున్నామో అదే విధంగా.

Advertisement

కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు అరెస్టు విషయంలో కేంద్రం జోక్యం చేసుకోలేదని లోకేష్.తెలియజేయడం జరిగింది.

అంతేకాకుండా తాను ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Prime Minister Modi and Union Home Minister Amit Shah ) అపాయింట్మెంట్లు కూడా కోరలేదని స్పష్టం చేశారు.చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేశారని లోకేష్ చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే నిన్న ఢిల్లీ నుండి విజయవాడకు లోకేష్ చేరుకున్నారు.నేడు చంద్రబాబును కలుసుకునేందుకు లోకేష్ రాజమండ్రి రాగానే చాలా రోజుల తర్వాత లోకేష్ నీ చూడడంతో నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి ముఖాలలో వెలుగులు నిండాయి.

ఈ సందర్భంగా అక్కడ భావోద్వేగ వాతావరణం నెలకొంది.

అదిగో అన్నారు ఇదిగో అన్నారు... వాయిదా వేశారంటయ్యా ? 
Advertisement

తాజా వార్తలు