టీడీపీ నేత నారా లోకేశ్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రతో వైసీపీకి భయం పట్టుకుందని ఆ పార్టీ నేత కొల్లు రవీంద్ర మండిపడ్డారు.అందుకే వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.
మాజీ మంత్రి కొడాలి నాని ఓ రాజకీయ వ్యభిచారి, పిచ్చికుక్క అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.తన స్వార్థం కోసం కొడాలి నాని ఏమైనా చేస్తారన్న కొల్లు రవీంద్ర చివరికి సీఎం జగన్ కు కూడా ద్రోహం చేస్తారని ఆరోపించారు.
కృష్ణా జిల్లాలో వైసీపీకి డిపాజిట్ కూడా రాదని జోస్యం చెప్పారు.అదేవిధంగా రాష్ట్రంలోనూ టీడీపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.