2019 ఎన్నికలు మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నారా లోకేష్ వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఘోరంగా ఓటమి చెందారు.అప్పటి వరకు మంత్రిగా ఉన్న లోకేష్ ఆ ఓటమి ని జీర్ణించుకోలేకపోయారు.
పెద్ద ఎత్తున అమరావతిలో టిడిపి ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టినా, మంగళగిరి నియోజకవర్గం ప్రజలు వైసీపీ వైపు ఎందుకు మొగ్గుచూపారు అనేది ఇప్పటికీ లోకేష్ కు అంతుపట్టని విషయమే.అక్కడ వైసీపీ నుంచి గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి టిడిపి హయాంలోనూ మంగళగిరి ఎమ్మెల్యే గానే ఉన్నారు.
ఆ సమయంలో అమరావతి కోసం రైతుల నుంచి పెద్ద ఎత్తున భూములను సేకరించే సమయంలో ఆయన రైతులకు అండగా నిలబడ్డారు.ప్రజా పోరాటాలు చేశారు.
అప్పటి ప్రభుత్వం ఆయనపై ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు చేసినా ఆయన వెనక్కి తగ్గలేదు.చివరికి ఆ ఫలితం 2019 ఎన్నికల్లో బాగా కనిపించింది.ఇక పూర్తిగా మంగళగిరి పై లోకేష్ ఆశలు వదిలేసుకున్నారు.2024 ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేయాలనే విషయంపై గత కొంత కాలంగా తర్జనభర్జన జరిగింది.అయితే చివరకు మంగళగిరి నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేయాలని లోకేష్ డిసైడ్ అయ్యారు.దీనికి కారణం వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డినే కారణం.
ఆయనకు వైసీపీ ప్రభుత్వం లో ప్రాధాన్యం దక్కుతుందని అంతా భావించినా చివరకు మంత్రి పదవి సైతం జగన్ ఇవ్వలేదు.దీంతో కాస్త అసంతృప్తితోనే రామకృష్ణారెడ్డి పెద్దగా జనాల్లోకి రావడం లేదు.ప్రజలకు ఆయనకు మధ్య గ్యాప్ పెరగడంతో రాబోయే ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందని మంగళగిరి నుంచి గెలవవచ్చు అని లోకేష్ అభిప్రాయపడుతున్నారట.ఎన్నికల ఫలితాల తర్వాత అనేకసార్లు మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ పర్యటనలు చేశారు.
అయితే ఇప్పుడు ఆ పర్యటనలకు దూరంగానే ఉంటున్నారు.అయినా అనేక సేవా కార్యక్రమాలు ఆయన చేపడుతున్నారు.
వీధి వ్యాపారులకు తోపుడుబండ్ల ను ఇటీవల లోకేష్ అందించారు. క్రమక్రమంగా తన ఇమేజ్ మంగళగిరి నియోజకవర్గంలో పెరిగే విధంగా లోకేష్ ప్లాన్ చేసుకుంటున్నారు.