అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ నమోదైంది.లాకప్ లో ఆంజనేయులు అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందాడు.
పీఎస్ లో ఉరి వేసుకొని చనిపోయినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో లాకప్ డెత్ పై కేసు నమోదు చేశారు.
ఇందులో భాగంగా సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ ఫకీరప్ప పరిశీలించారు.మృతదేహాన్ని స్థానిక కమ్యూనిటీ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
అనంతరం విధుల్లో నిర్లక్ష్యం వహించిన సీఐతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెండ్ చేశారు.కాగా పైపల్లి గ్రామంలో నిన్న గొర్రెల దొంగతనానికి ఆంజనేయులతో పాటు మరొక వ్యక్తి వచ్చాడు.
నిందితులను పట్టుకున్న గ్రామస్థులు పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే.







