లాక్ డౌన్ ఎత్తివేత నిజమే కానీ ?

ఇప్పటికీ దేశవ్యాప్తంగా ప్రజలంతా గందరగోళం, భయాందోళనలో ఉన్నారు.కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అన్ని వ్యవస్థలు అతలాకుతలం అయ్యాయి.

ప్రపంచం ఎప్పుడు చవిచూడని విపత్తును ఇప్పుడు చూస్తోంది.ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ప్రతి ఒక్కరూ ఈ మహమ్మారి కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఇక దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కారణంగా ప్రజలు, ప్రభుత్వాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నాయి.అయితే ఈ లాక్ డౌన్ నిబంధన ఏప్రిల్ 14వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో, దూరప్రాంతాల్లో చిక్కుకున్న వారంతా బస్సులు, రైలు, విమానాలు ద్వారా తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు అప్పుడే ముందస్తు బుకింగ్ చేసుకుంటున్నారు.

ప్రభుత్వరంగ సంస్థలు కూడా ఈ మేరకు బుకింగ్ లు ప్రారంభించడంతో లాక్ డౌన్ నిబంధన పూర్తిగా ఎత్తి వేస్తారనే నమ్మకం ప్రజల్లోనూ పెరిగింది.అంతకుముందే ఈ విషయంలో మోదీ కఠినంగా వ్యవహరించి మరికొంతకాలం లాక్ డౌన్ నిబంధనలు పోదిగిస్తరనే వార్తలు వచ్చినా అవన్నీ అసత్యాలని తేలిపోతోంది.

Advertisement

అసలు 14వ తేదీతో లాక్ డౌన్ నిబంధనలు ఎత్తి వేయడానికి కారణాలు కూడా లేకపోలేదు.ఇప్పటికే సుదీర్ఘంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న తరుణంలో, దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై, ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

మరికొంతకాలం ఈ నిబంధనలు పొడిగిస్తే దేశం ఆర్థికంగా కోలుకోలేని విధంగా నష్టాలను చవిచూడల్సి వస్తుంది.అందుకే లాక్ డౌన్ నిబంధనలు ఎత్తివేత కు నిర్ణయం తీసుకున్నట్టు అర్థం అవుతోంది.

ఒక్కసారిగా లాక్ డౌన్ ఎత్తివేస్తే మళ్ళీ జనమంతా రోడ్లపైకి గుంపులు గుంపులుగా రోడ్లపైకి వస్తారని, ఇప్పటివరకు విధించిన లాక్ డౌన్ మొత్తం వృధా అవుతుందని ప్రధాని భావిస్తున్నట్లు తెలుస్తోంది అందుకే విడతలవారీగా సడలింపు ఇవ్వాలని అని చూస్తున్న టు సమాచారం.దీనికోసం చైనా పాటించిన విధానాన్ని మన దేశంలోనూ అమలు చేసేందుకు మోదీ సిద్దం అవుతుండడం చర్చనీయాంశం అవుతోంది.అనారోగ్యం గా ఉన్నవారు ఎవరినైనా ఇళ్లకే పరిమితం చేసేలా నిబంధనలు రూపొందిస్తున్నట్లు సమాచారం.

అలాగే రోడ్లపైకి గుంపులు గుంపులుగా జనాలు రాకుండా చూడడంతో పాటు, పెళ్లిళ్లు, ఫంక్షన్ల పై ఆంక్షలు విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

Advertisement

తాజా వార్తలు