అడ్డంగా బుక్కైన బిగ్ బాస్ లోబో.. బిగ్ బాస్ అలాంటి షో అని చెబుతూ..?

బిగ్ బాస్ షో సీజన్ 5కు ఎంపికైన కంటెస్టెంట్లలో లోబో ఒకరనే సంగతి తెలిసిందే.

తనదైన శైలి కామెడీతో లోబో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు పాపులారిటీని సంపాదించుకున్నారు.

బిగ్ బాస్ హౌస్ లోకి లోబో ఆరో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు.అయితే గతంలో ఒక సందర్భంలో బిగ్ బాస్ షో గురించి లోబో చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

గతంలో లోబో బిగ్ బాస్ షో తనకు సూట్ కాదనేలా మాట్లాడారు.అయితే బిగ్ బాస్ సీజన్ 5లో లోబో పాల్గొనడంతో కొంతమంది ఆ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.

యాంకర్ బిగ్ బాస్ షోను చూస్తుంటారా అని లోబోను అడగగా బిగ్ బాస్ షోకు దండం అని లోబో చెప్పుకొచ్చారు.బిగ్ బాస్ షో తన టేస్ట్ కు తగిన షో కాదని లోబో చెప్పుకొచ్చారు.

Advertisement

తనకు బిగ్ బాస్ షో నచ్చదని ఆ షోలో తనకు ఛాన్స్ రాకపోతేనే మంచిదని లోబో కామెంట్లు చేయడం గమనార్హం.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఛాన్స్ రాని సమయంలో బిగ్ బాస్ షో గురించి ఒకలా ఛాన్స్ వచ్చిన తర్వాత మరోలా మాట్లాడటం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.బిగ్ బాస్ షో గురించి లోబో గతంలో చేసిన కామెంట్లు అతనికి పడే ఓట్లపై కొంతమేర ప్రభావం చూపే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.హైదరాబాదీ యాసలో యాంకరింగ్ చేసే లోబో బిగ్ బాస్ హౌస్ లో ఎన్ని వారాలు కొనసాగుతారో చూడాల్సి ఉంది.

నామినేషన్ల ద్వారా బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్ల మధ్య గొడవ పెట్టే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం.ఈ వారం ఎలిమినేషన్ కు ఎంతమంది కంటెస్టెంట్లు ఎంపికవుతారో చూడాల్సి ఉంది.

ఎన్టీఆర్ ఫ్యాన్ చేసిన పని తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. తారక్ ను చూడాలని 300 కిలోమీటర్లు నడిచాడా?
Advertisement

తాజా వార్తలు