మీకు అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు ఇబ్బంది పడుతుంటారు.అయితే ఇటువంటి సందర్భాల్లో మీరు అనేక మార్గాల్లో డబ్బును ఏర్పాటు చేసుకోవచ్చు.
అయితే మీరు ఇప్పటికే షేర్లలో ఇన్వెస్ట్ చేసి ఉంటే. అత్యవసర పరిస్థితుల్లో ఆషేర్లను తాకట్టు పెట్టి కూడా రుణం తీసుకోవచ్చు.
దీని కోసం మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు.మీరు ఆన్‌లైన్‌లో రుణం తీసుకోవచ్చు.
మీరు మీ అవసరాలకు అనుగుణంగా షేర్లను తాకట్టు పెట్టి, రుణం పొందవచ్చు.బ్రోకరేజ్ సంస్థ జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో భాగమైన జియోజిత్ క్రెడిట్స్ తాజాగా షేర్లపై రుణాలు (ఎల్‌ఎఎస్) కోసం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించింది.
జియోజిత్ నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ డీమ్యాట్ ఖాతాదారునికి షేర్లపై రుణాన్ని అందించే మొదటి కంపెనీగా అవతరించింది.మీడియాతో కొచ్చిలోని ఎన్‌ఎస్‌డిఎల్ ఎండి పద్మజా చంద్రు మాట్లాడుతూ పెట్టుబడిదారులకు తక్షణ లిక్విడిటీని అందించడానికి ఈ డిజిటల్ ఎల్‌ఎస్‌ఎ సదుపాయం కల్పించామన్నారు.
పెట్టుబడిదారులకు తక్షణ వ్యక్తిగత ఖర్చులను తీర్చడంలో సహాయం చేయడం దీని ముఖ్య ఉద్దేశ్యమనన్నారు.

జియోజిత్ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఎండీ సీజే మాట్లాడుతూ తమ షేర్లను తాకట్టు పెట్టి, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే క్లయింట్లు తమ డీమ్యాట్ ఖాతాలలో అర్హత ఉన్న షేర్లను ఉచితంగా ఉంచుకోవాలని తెలిపారు.అలాగే వారు సంతృప్తికరమైన సిబిల్ స్కోర్‌ను కలిగి ఉండాలన్నారు.ఎన్ఎస్‌డీఎల్‌లో డీమ్యాట్ ఖాతా ఉన్న వారందరూ ఈ సదుపాయం కింద రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.