Samantha : జనాలను పిచ్చోళ్లను చేయకు సమంత… ఫైర్ అయిన డాక్టర్.. ఏమైందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి సమంత ( Samantha ) ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ హెల్త్ పాడ్ కాస్ట్ లో భాగంగా ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో విషయాలను వెల్లడిస్తున్నారు.

అయితే ఇటీవల సమంత కాలేయ ఆరోగ్యాన్ని ( Liver Health ) కాపాడుకోవాలి అంటే ఏం చేయాలి అనే విషయాలను చెప్పుకువచ్చారు.

అయితే ఈ వ్యాఖ్యలపై ఒక డాక్టర్ సోషల్ మీడియా వేదికగా సమంతపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.సమంత చేసిన ఈ వ్యాఖ్యల గురించి ఈయన సోషల్ మీడియాలో స్పందిస్తూ తనకు ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు.

కేవలం తప్పుడు వ్యాఖ్యలతో ఇంతమంది ఫాలోవర్స్ ను తప్పుదోవ పట్టించదు.తెలిస్తే తెలుసని లేదంటే తెలియదని చెప్పాలి కానీ మెడిసిన్ పట్ల అలాగే శరీరంలో ఏ అవయవాలు ఎలా పనిచేస్తాయి అనే అవగాహన లేనటువంటి వారిని తీసుకువచ్చి ఇలా తప్పుడు వార్తలను ప్రచారం చేయడం మంచిది కాదని డాక్టర్ సమంతపై ఫైర్ అయ్యారు.

కాలేయాన్ని శుద్ధి చేయడం ఎలా అనే విషయాలను తెలియజేస్తూ సమంత ఏమాత్రం అవగాహన లేనటువంటి ఒక న్యూట్రిషనిస్ట్, వెల్ నెస్ కోచ్( Nutritionist, Wellness Coach ) లను తీసుకువచ్చి మాట్లాడిస్తున్నారు.మనలో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోయిన కొన్ని మూలికల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అంటూ ఏవేవో పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు.డాండెలియన్  అనే మొక్క లివర్ ఆరోగ్యాన్ని కాపాడుతుందని చెబుతున్నారు.

Advertisement

తాను గత దశాబ్దాలుగా కాలేయ రోగులకు చికిత్స( Treatment of liver patients ) అందిస్తున్నటువంటి డాక్టర్ని.డాండెలియన్ అనే మొక్కలు చాలా మంది కలుపు ముక్కలుగానే భావిస్తారు మరి కొందరు సలాడ్ రూపంలో కూడా తీసుకుంటూ ఉంటారు అయితే దీనిని తీసుకోవడం వల్ల యూరిన్ ఎక్కువగా వస్తుంది.  ప్రస్తుత కాలంలో కలుపు మందులు ఎక్కువగా వాడుతున్నటువంటి నేపథ్యంలో దీనిని తీసుకోకపోవడం మంచిదని ఈయన తెలిపారు.

డాండెలియన్ పందులపై ఎలకలపై ప్రయోగించారు కానీ మనుషులపై కాదు అంటూ సమంత అందిస్తున్నటువంటి తప్పుడు ప్రచారంపై ఈయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ మొక్క గురించి పూర్తి వివరాలను వెల్లడించారు ప్రస్తుతం ఈయన చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు