Hair Tonic : జుట్టు రాలడాన్ని నివారించే బెస్ట్ హోమ్ మేడ్ హెయిర్ టానిక్.. అస్సలు మిస్ అవ్వకండి!

జుట్టు రాలడం( Hair Fall ) అనేది స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఎంతో మందిని కలవరపెట్టే అత్యంత సర్వసాధారణమైన సమస్య.అయితే హెయిర్ ఫాల్ కొందరిలో తక్కువగా ఉంటే కొందరిలో మాత్రం చాలా అధికంగా ఉంటుంది.

 Best Homemade Tonic For Stopping Hair Fall-TeluguStop.com

ఇలాంటి వారు తెగ హైరానా పడిపోతుంటారు.జుట్టు దువ్వాలంటేనే భయపడుతుంటారు.

జుట్టు రాలడాన్ని ఎలా అరికట్టాలో తెలియక తీవ్ర ఆందోళనకు లోనవుతుంటారు.కానీ వర్రీ వద్దు.

నిజానికి కొన్ని కొన్ని ఇంటి చిట్కాలు జుట్టు రాలడాన్ని సమర్థవంతంగా అరికడతాయి.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ హెయిర్ టానిక్ ను( Homemade Hair Tonic ) కనుక వాడారంటే హెయిర్ ఫాల్ ఎంత తీవ్రంగా ఉన్నా సరే దెబ్బకు కంట్రోల్ అవుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెయిర్ టానిక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా అంగుళం అల్లం ముక్క( Ginger ) తీసుకొని పీల్ తొలగించి సన్నగా తురుముకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

Telugu Tonic, Curry, Flax Seeds, Ginger, Care, Care Tips, Fall, Healthy, Homemad

వాటర్ హీట్‌ అవ్వగానే రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు,( Flax Seeds ) అల్లం తురుము వేసుకోవాలి.అలాగే రెండు రెబ్బలు కరివేపాకు( Curry Leaves ) వేసి 10 నిమిషాల పాటు ఉడికించాలి.దాంతో వాటర్ థిక్ స్ట్రక్చర్ లోకి మార‌తాయి.

అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ ఆముదం వేసి బాగా మిక్స్ చేస్తే మన హెయిర్ టానిక్ అనేది సిద్ధమవుతుంది.

ఈ టానిక్ ను ఒక బాటిల్ లో నింపుకోవాలి.ఆపై స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి హెయిర్ టానిక్ ను అప్లై చేసుకుని బాగా మసాజ్ చేసుకోవాలి.

Telugu Tonic, Curry, Flax Seeds, Ginger, Care, Care Tips, Fall, Healthy, Homemad

గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ హోమ్ మేడ్ టానిక్ ను వాడారంటే హెయిర్ ఫాల్ అన్న మాటే అనరు.అల్లం, అవిసె గింజలు, కరివేపాకు మరియు ఆముదం లో ఉండే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టుకు చక్కని పోషణ అందిస్తాయి.మూలాల నుంచి కుదుళ్లను బలోపేతం చేస్తాయి.

హెయిర్ ఫాల్ సమస్యను సమర్థవంతంగా నివారిస్తాయి.అదే సమయంలో జుట్టు ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తాయి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube