చర్మ సమస్యల్లో అత్యధికంగా వేధించే వాటిలో మొటిమలు, మచ్చలు ముందు వరుసలో ఉంటాయి.ఇవి మొత్తం అందాన్ని డ్యామేజ్ చేస్తాయి.
అందుకే మొటిమలు, మచ్చలు ( Acne, scars )అంటే తీవ్ర అసహనానికి లోనవుతుంటారు.వాటిని వదిలించుకోవడం కోసం ఎన్నెన్నో ఖరీదైన క్రీములను వాడుతుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే ఆయిల్ మీకు చాలా బాగా సహాయపడుతుంది.రోజు నైట్ ఈ ఆయిల్ ను వాడారంటే మొటిమలు, మచ్చలు దెబ్బకు పరార్ అవుతాయి.మీ చర్మం అందంగా, యవ్వనంగా మెరిసిపోతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా వన్ టేబుల్ స్పూన్ లవంగాలు( spoon cloves ) తీసుకుని లైట్ గా క్రష్ చేసుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక చిన్న కప్పు నువ్వుల నూనె ( Sesame oil )పోసుకోవాలి.ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే అందులో క్రష్ చేసి పెట్టుకున్న లవంగాలను వేసి చిన్న మంటపై కనీసం 15 నిమిషాల పాటు మరిగించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మరిగించిన ఆయిల్ ను స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి.
పూర్తిగా కూల్ అయ్యాక అందులో వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్( Vitamin E oil ) , నాలుగు చుక్కలు టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్( Tea tree essential oil ) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ ఆయిల్ ను ఒక బాటిల్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు ముఖానికి మేకప్ ఉంటే తొలగించి వాటర్ తో వాష్ చేసుకోవాలి.
ఆపై తయారు చేసుకున్న ఆయిల్ ను ముఖానికి అప్లై చేసి కనీసం ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.మరుసటి రోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.
ఈ విధంగా ప్రతిరోజు కనుక చేశారంటే అద్భుత ఫలితాలు పొందుతారు.ఈ ఆయిల్ మొటిమలు మరియు మచ్చలకు వ్యతిరేకంగా పోరాడుతుంది.కొద్ది రోజుల్లోనే మొటిమలను నివారిస్తుంది.మచ్చలను మాయం చేస్తుంది.అలాగే ముడుతలను దూరం చేసి చర్మాన్ని యవ్వనం గా మారుస్తుంది.కాంతివంతంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.
కాబట్టి మొటిమలు, మచ్చలు లేని మెరిసే అందమైన చర్మాన్ని కోరుకునేవారు తప్పకుండా ఈ ఆయిల్ ను ట్రై చేయండి.