2023లో మోత మోగించడానికి సిద్ధం అవుతున్న భారీ మూవీలు ఇవే!

2022 ఏడాది వచ్చి అప్పుడే పూర్తి కూడా కాబోతుంది.2020 నుండి కరోనా కారణంగా వెలవెలబోయిన బాక్సాఫీస్ 2022 లోనే కతా పుంజుకుంది.

ఆ రెండేళ్లు సినీ ఇండస్ట్రీ చాలా సఫర్ అయ్యింది.

ఎన్నో కోట్ల నష్టాన్ని భరించింది.పెద్ద పెద్ద నిర్మాతలు సైతం ఏం చేయాలో అర్ధం కాక తలలు పట్టుకున్నారు.అయితే 2022 సంక్రాంతి సీజన్ నుండి కాస్త టాలీవుడ్ ఊపిరి పీల్చుకుంది.

స్టార్ హీరోలే కాదు చిన్న హీరోలు సైతం మంచి సక్సెస్ సాధించారు.ఇక ఇప్పుడు 2022 ముగింపు దశకు చేరుకుంది.

మరో రెండు నెలలు గడిస్తే ఈ ఏడాది పూర్తి అయ్యి 2023 ఎంటర్ అవుతుంది.ఇక 2023 సంక్రాంతి నుండే భారీ పోటీ నెలకొనబోతుంది.

Advertisement

మరి 2023 ఏడాదిలో భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ కు చాలానే రెడీ అవుతున్నాయి.అందులో ముందుగా చెప్పుకోవాల్సిన సినిమా ఆదిపురుష్.

ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రామాయణ నేపథ్యంలో తెరకెక్కింది.ఇక ఇదే సంక్రాంతికి దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న వారసుడు సినిమా కూడా రిలీజ్ కాబోతుంది.

విజయ్ దళపతి హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాపై అంచనాలు బాగా ఉన్నాయి.ఈ రెండు సినిమాలే కాకుండా మరో సినిమా కూడా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమాల్లో వాల్తేరు వీరయ్య (వర్కింగ్ టైటిల్) ఒకటి.

మెగాస్టార్ 154వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఈ సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట

ఇక సంక్రాంతి తర్వాత సమ్మర్ కి ముందే మరిన్ని సినిమాలు లైన్లో పెట్టుకున్నారు స్టార్స్.పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు కూడా 2023 లోనే రిలీజ్ కానుంది.మొదటిసారి పవన్ భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు.

Advertisement

దీంతో అంచనాలు భారీగా పెరిగి పోయాయి.అలాగే నాని దసరా సినిమా, రవితేజ ధమాకా సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి.

ఇంకా మహేష్ SSMB28 కూడా ఏప్రిల్ లో రిలీజ్ కానుంది.ప్రభాస్ మరో సినిమా సలార్, రామ్ చరణ్ ఆర్సీ15, కమల్ హాసన్ ఇండియన్ 2 సెకండాఫ్ లో రానున్నాయి.

ఎన్టీఆర్ 20 సైతం సెకండాఫ్ తర్వాత వచ్చే అవకాశం ఉంది.

తాజా వార్తలు