శ్రీకాంత్ ను ఆ పేరుతో పిలిచి ఆటపట్టించిన స్టార్ హీరోయిన్.. మారలేదంటూ?

శ్రీకాంత్ లైలా కాంబినేషన్ లో ఎగిరే పావురమా సినిమా తెరకెక్కగా ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మించి మెప్పించింది.

 Laila Comments About Hero Srikanth Details, Egire Pavurama, Karthi , Laila, Sard-TeluguStop.com

సల్లపం అనే మలయాళ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.అయితే సర్దార్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా లైలా ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.

ఎగిరే పావురమా సినిమాలోని కొన్ని సీన్లలో లైలా శ్రీకాంత్ ను కొలబద్ధ అని పిలుస్తూ ఆట పట్టించడంతో పాటు ఏడిపిస్తుంది.అయితే నిజ జీవితంలో కూడా శ్రీకాంత్ ను నేను అదే విధంగా ఏడిపిస్తానని లైలా వెల్లడించడం గమనార్హం.

సర్దార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న లైలా ఈ సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించడం గమనార్హం.శ్రీకాంత్ ను ఇప్పటికీ నేను కొలబద్ద అని పిలుస్తానని ఆమె అన్నారు.

యాంకర్ కొలబద్ద అని పిలిచి లైలాను స్టేజ్ మీదకు ఆహ్వానించడంతో లైలా ఈ కామెంట్లు చేయడం గమనార్హం.

Telugu Egire Pavurama, Karthi, Karthi Sardar, Kolabaddha, Laila, Laila Sardar, L

సర్దార్ సినిమా గురించి లైలా మాట్లాడుతూ సర్దార్ సినిమా చాలా స్పెషల్ మూవీ అని తెలిపారు.నేను హీరోయిన్ పాత్రలో నటించిన శివపుత్రుడు మూవీ దీపావళి పండుగ కానుకగా విడుదలై సంచలన విజయం సాధించిందని లైలా కామెంట్లు చేశారు.

Telugu Egire Pavurama, Karthi, Karthi Sardar, Kolabaddha, Laila, Laila Sardar, L

సర్దార్ సినిమాలో కార్తి అద్భుతంగా నటించారని లైలా వెల్లడించడం గమనార్హం.మిత్రన్ గారు చాలా మంచి మూవీని తెరకెక్కించారని థియేటర్లలో అందరూ ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయాలని లైలా తెలిపారు.లైలా వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సర్దార్ సినిమాతో కార్తి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది.లైలా అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube