నాగార్జునను టీజ్ చేసిన సీనియర్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

టాలీవుడ్ మన్మథుడిగా గుర్తింపు పొందిన నాగార్జున. పలు సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేసి టాప్ హీరోగా ఎదిగాడు.

ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.దిగ్గజ తెలుగు సినిమా నటుడు అక్కినేని నాగేశ్వర్ రావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన.తొలి సినిమా విక్రమ్ తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆ తర్వాత ఆఖరి పోరాటం, విక్కీ దాదా, శివ లాంటి సంచలన సినిమాల్లో హీరోగా నటించి తిరుగులేని హీరోగా మారిపోయాడు.

తన ఫస్ట్ మూవీ నుంచే అమ్మాయిల మనసు దోచాడు నాగార్జున.అప్పట్లోనే నాగ్ కు లేడీ ఫాలోయింగ్ మామూలుగా ఉండేది కాదు.ఎంతో మంది హీరోయిన్లతో కలిసి నటించిన నాగార్జన.

ఇద్దరు హీరోయిన్లతో తెగ ఇబ్బంది పడ్డాడట.ఇంతకీ వాళ్లెవరో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

నిజానికి ఆ ఇద్దరు హీరోయిన్లు.నాగార్జున కంటే చాలా సీనియర్లు.

వారు సినిమాల్లోకి వచ్చిన చాలా ఏండ్ల తర్వాత ఆయన సినిమాల్లోకి వచ్చాడు.దీంతో వారు షూటింగ్ స్పాట్లో నాగార్జునను టీజ్ చేసేవారట.

వారిద్దరితో ఆయన కలిసి నటించిన సినిమా ఆఖరి పోరాట.రాఘవేంద్ర రావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించాడు.ఇందులో హీరోయిన్లుగా శ్రీదేవి, సుహాసిని నటించారు.

అమ్మతోడు ఆస్తి కోసం కాదు.. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు నెట్టింట వైరల్!
డ్యాన్స్ స్టెప్స్ విమర్శల గురించి స్పందించిన శేఖర్ మాస్టర్.. అలా చెప్పడంతో?

యండమూరి వీరేంధ్రనాథ్ రాసిన నవల ఆధారంగా ఈ సినిమా తీశారు.ఈ సినిమా సమయానికి శ్రీదేవి, సుహాసిని సీనియర్ హీరోయిన్లుగా కొనసాగుతున్నారు.

Advertisement

ఈ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు శ్రీదేవి, సుహాసిని నాగార్జునను అస్సలు పట్టించుకునేవారు కాదట.సినిమా యూనిట్ సభ్యులు కూడా నాగార్జునను సరిగా పట్టించుకోలేదట.దీంతో నాగార్జున ఎవరితో మాట్లాడకుండా ఓ చోట కూర్చునే వాడట.

తన సీన్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే సెట్స్ మీదికి వచ్చేవాడట.ఆ తర్వాత మళ్లీ వెళ్లి అక్కడే కూర్చునే వాడట.

చివరకు శ్రీదేవి, సుహాసిని మాట్లాడిన ఆ, హూ అంటూ మాత్రమే అనేవాడట.ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున చెప్పాడు.

హీరోగా ఉన్న తనను వారు పట్టించుకోకపోవడం వల్ల తాను చాలా ఫీలైనట్లు చెప్పాడు.

తాజా వార్తలు