తన సినీ కెరీర్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలు చేసి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోగా ఆర్యకు పేరుంది.కోలీవుడ్ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా ఆర్యను అభిమానించే అభిమానుల సంఖ్య ఎక్కువగానే ఉంది.
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన ఆర్య అకస్మాత్తుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో పాటు విజయాలను సొంతం చేసుకున్నారు.కెరీర్ లో అపజయాలు ఎదురైన ప్రతిసారి భారీ సక్సెస్ ను సొంతం చేసుకుని ఆర్య కెరీర్ లో అంతకంతకూ ఎదుగుతున్నారు.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివే సమయంలో ఒక అమ్మాయిని ప్రేమించానని అదే సమయంలో తనకు ఎంతో ఇష్టమైన ఫుట్ బాల్ కూడా ఆడేవాడినని ఆర్య అన్నారు.తనకు ఇష్టమైన అమ్మాయికి ఎదురుగా వెళ్లి నవ్వితే ఆమె ముఖం తిప్పుకునేదని ఎందుకలా చేస్తున్నావని అడగగా తనకు ఆటలపైనే ఎక్కువగా ఆసక్తి ఉందని మ్యాన్లీనెస్ లేదని ఆ అమ్మాయి కామెంట్లు చేసిందని ఆర్య వెల్లడించారు.
ఆ తరువాత తాను జిమ్ లో చేరానని ఆర్య చెప్పుకొచ్చారు.
కేరళలో ముస్లిం ఫ్యామిలీలో తాను జన్మించానని వ్యాపారం కొరకు చెన్నైకు వచ్చి తన కుటుంబం స్థిరపడిందని ఆర్య తెలిపారు.

నాన్న తాను అమెరికాకు వెళ్లి చదువుకోవాలని కలలు కనేవారని ఆర్య వెల్లడించారు.మొదట తనకు ఒక చిన్న సినిమాలో ఛాన్స్ వచ్చిందని జీవా డైరెక్షన్ లో తెరకెక్కిన 12బి సినిమాలో నటించానని ఆర్య పేర్కొన్నారు.ఒక దశలో యాక్టింగ్ తనకు నరకంలా అనిపించిందని ఆర్య అన్నారు.