తెలుగు వారు గర్వపడేలా...అగ్ర రాజ్యం అమెరికా లో అగ్ర స్థానంలో మన “తెలుగు భాష”

దేశ భాషలందు తెలుగు లెస్సా అంటారు, అలాగే తెలుగు కంటే తియ్యనయిన భాష వేరేది లేదు అంటారు.

తెలుగు బాషకు ఉన్న ప్రాముఖ్యత అలాంటిది, మాట్లాడుతుంటే తేనెలొలికే మన తెలుగు బాష ఇప్పుడు అగ్ర రాజ్యం అమెరికాలో అగ్ర స్థానంలో నిలిచింది.

అలా ఇలా కాదు ఇంగ్లీష్ తరువాత అమెరికాలో మాట్లాడే బాషలలో తెలుగుదే టాప్ ప్లేస్.అక్కడ తెలుగు మాట్లాడే వారి సంఖ్య వేగంగా పెరుగుతోందని, కేవలం మన తెలుగు రాష్ట్రాల వారే కాకుండా స్థానికంగా ఉన్న అమెరికన్స్ సైతం తెలుగు నేర్చుకోవడానికి ఆశక్తి చూపుతున్నారని అమెరికా థింక్ టాంక్ అలాగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం, సెంటర్ ఆఫ్ ఇమ్మిగ్రేషన్ సంయుక్తంగా కలిసి నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది.

వారు చేపట్టిన సర్వే ప్రకారం.అమెరికాకు వివిధ దేశాల నుంచీ ఎంతో మంది వలసలు వచ్చారు.

అలా వచ్చిన వారిలో వివిధ బాషల వారు కూడా ఉన్నారు.అయితే భారత్ లోని తెలుగు రాష్టాల నుంచీ వచ్చిన వారు మాట్లాడే తెలుగు బాషకు ప్రాముఖ్యత పెరుగుతూ వస్తోందని ప్రకటించారు.

Advertisement

గడించిన ఏడేళ్ళలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య దాదాపు 86 శాతం పెరిగిందని అమెరికాలో ఇంగ్లీష్ కాకుండా అత్యధికంగా మాట్లాడే 20 బాషలలో తెలుగు అగ్ర స్థానంలో ఉందని తెలిపారు.

అమెరికాలో ఇతర బాషలతో పోల్చితే తెలుగు మాట్లాడే వారు సుమారు 4 లక్షల మంది ఉన్నారట.మరొక విషయం ఏమిటంటే అమెరికాలో అత్యధికంగా మాట్లాడే టాప్ 10 బాషలు మన దక్షినాది ప్రాంతానికి చెందినవేనట.అయితే ఈ స్థాయిలో తెలుగు బాష అమెరికాలో వెలుగులు జిమ్మదానికి కారణాలు లేకపోలేదు.

భారత్ నుంచీ వివిధ దేశాలకు ఐటీ నిపుణులు అత్యధికంగా వెళ్ళేది హైదరాబాద్ నుంచే, అమెరికాలో ఉన్న భారత కంపెనీలు సైతం హైదరబాద్ నుంచీ వచ్చే తెలుగు ఐటీ నిపుణులకు ప్రాధాన్యత ఇస్తున్నారు, అంతేకాదు అమెరికాలో ఉంటున్న తెలుగు సంఘాలు తెలుగు బాషాభివ్రుద్ది కి కృషి చేయడంతో పాటు తమ పిల్లలకు తెలుగు నేర్పేందుకు పాటశాలలను సైతం ఏర్పాటు చేయడం విదేశీయులు సైతం తెలుగు నేర్చుకోవడానికి పోటీ పడటం ఇందుకు కారణమని తెలుస్తోంది.మనబడి, పాటశాల, తెలుగు నేర్పేందుకు ఎనలేని కృషి చేస్తున్నాయి.

తెలుగు బాషకు అగ్ర రాజ్యంలో ఇంత గౌరవం రావడం తెలుగు వారందరూ గర్వపడే విషయమే.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు