ముంబైలో ఇంటి ముందుకొచ్చిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే...

మన దేశానికి న్యూ ఢిల్లీ రాజధాని అయినా కానీ ఆర్థిక రాజధాని మాత్రం ముంబయే.ముంబై వీధుల్లో ఉండే రద్దీని చూస్తే వామ్మో అని అపిస్తుంది.

అలా ఉంటారు అక్కడి జనాలు.ఇక ఈ మహా నగరం జనాభాను చూస్తే ఎవరైనా సరే షాక్ తినాల్సిందే.

ఇక్కడ పగలూ, రాత్రి అనే సంబంధం లేకుండా 24 గంటలు జనసంచారం ఉంటూనే ఉంటుంది.ఈ జనాలను చూసి ఎవరైనా సరే నోరెళ్లబెట్టాల్సిందే.

అసలు ముంబై నగరం నిద్ర పోతుందా? అని కూడా చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తారు.ఎప్పుడూ ఏదో ఒక చోట ఏదో విషయం జరుగుతూనే ఉంటుంది.

Advertisement

ఇప్పుడు ముంబై మహానగరంలో జరిగిన ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అంత పెద్ద నగరంలో ప్రతి రోజు అనేక విషయాలు జరుగుతూనే ఉంటాయి కదా.అని తక్కువగా తీసిపారేయకండి.అంతలా జన సంచారం ఉన్న నగరంలోకి ఓ చిరుత ప్రవేశించడం అక్కడి వారిని భయాందోళనలకు గురి చేస్తోంది.

నగరంలోకి ప్రవేశించిన చిరుత ఏం చేసిందంటే.ఆర్థిక రాజధాని ముంబైలోని గోరేగావ్ అనే ప్రాంతంలోనికి ఓ చిరుత ప్రవేశించింది.

ఆ చిరుత ఓ ఇంటి ముందు గేటు వద్ద తాపీగా కూర్చున్న వీడియో ప్రస్తుతం హల్చల్ అవుతుంది.ఆ చిరుత కాసేపు అక్కడ కూర్చొని అక్కడి నుంచి లేచి వెళ్లిపోయింది.

ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.ఇక్కడ చిరుత చేసిందంతా అక్కడ ఉన్న సీసీ టీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డు అయింది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా.అది కాస్త వైరల్ గా మారింది.దీంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు.

Advertisement

చిరుత సంచరించిన ప్రదేశంలో పెట్రోలింగ్ నిర్వహిస్తామని, ఈ విషయంపై స్థానికులకు అవగాహన పెంపొందించేందుకు సమావేశాలు ఏర్పాటు చేస్తామని అంటున్నారు.పట్టణీకరణ పేరుతో అడవులను నరికివేయడం వల్లే ఇలా క్రూర జంతువలు ఇళ్లలోకి వస్తున్నాయని అనేక మంది ఆరోపిస్తున్నారు.

తాజా వార్తలు