'లియో' యూఎస్ లో సంచలనం.. రిలీజ్ కు ముందే 1.25 మిలియన్ ప్రీ సేల్స్!

స్టార్ హీరో దళపతి విజయ్ జోసెఫ్( Thalapathy Vijay ) సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ లియో.

ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇప్పటి వరకు మేకర్స్ పెద్దగా ప్రమోషన్స్ అయితే చేసింది లేదు.టీజర్, పాటలు, ట్రైలర్ అయితే రిలీజ్ చేసారు.

కానీ ఎలాంటి ప్రెస్ మీట్స్ కానీ ఈవెంట్స్ కానీ తమిళ్ లోనే కాదు ఎక్కడ కూడా నిర్వహించలేదు.

అయినప్పటికీ ఈ సినిమాకు గతంలో విజయ్ సినిమాలకు సైతం లేనంత హైప్ పెరిగింది.తమిళ్ లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా విజయ్ సినిమాకు అదిరిపోయే ప్రీ సేల్స్ జరుగుతున్నాయి.మన తెలుగులో విజయ్ సినిమాలు హిట్ అయినా పెద్దగా మార్కెట్ లేదు.

Advertisement

కానీ ఈసారి అలా కాదు లియో సినిమాకు తెలుగులో కూడా మంచి ప్రీ సేల్స్ పెరిగాయి.ఇక ఇక్కడే కాదు ఓవర్సీస్ లో అయితే లియో సినిమా( Leo movie ) రిలీజ్ కు ముందే సంచలనాలు క్రియేట్ చేస్తూ పోతుంది.

ఈ సినిమా యూఎస్ఏ ప్రీమియర్ ప్రీ సేల్స్ లో దూసుకు పోతున్నట్టు తెలుస్తుంది.ఇప్పటి వరకు ఈ సినిమాకు 55000 కు పైగానే టికెట్స్ అమ్ముడు పోయాయట.మరి ఇంత మొత్తంలో టికెట్స్ ద్వారా అక్కడ 1.25 మిలియన్ డాలర్స్ ను రాబట్టినట్టు మేకర్స్ అఫిషియల్ గా కన్ఫర్మ్ చేసారు.

చూస్తుంటే రిలీజ్ నాటికీ 1.5 మిళియన్స్ ను క్రాస్ చేసేలానే కనిపిస్తుంది.మరి రిలీజ్ అనంతరం ఈ మూవీ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.

కాగా లియో సినిమాలో విజయ్ కు జంటగా స్టార్ హీరోయిన్ త్రిష ( Trisha )నటిస్తుంది.సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

ఈ సినిమాను అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు