ఒకే నెలలో ఒకేసారి ఉద్యోగాలు సాధించిన అన్నాదమ్ముళ్లు.. వీళ్ల సక్సెస్ కు గ్రేట్ అనాల్సిందే!

ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం సులువైన విషయం కాదు.

తండ్రి పడే కష్టాన్ని చూసిన ఇద్దరు కొడుకులు తమ కష్టంతో అనుకున్న లక్ష్యాన్ని సాధించడంతో పాటు అందరి చేత శభాష్ అనిపించుకున్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని అదిలాబాద్ జిల్లాలోని( Adilabad ) సారంగ్ పూర్ మండలం ఆలూరు గ్రామానికి చెందిన అన్నాతమ్ముళ్లు( Brothers ) తమ సక్సెస్ తో ప్రశంసలు అందుకుంటున్నారు.నెలరోజుల వ్యవధిలో ఉద్యోగాలు సాధించిన ఈ అన్నాదమ్ముళ్లు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

తండ్రి బీడీ కంపెనీని నిర్వహిస్తూ కొడుకులను కష్టపడి చదివించగా పెద్దవాడైన లక్ష్మీరాజు( Lakshmiraju ) కానిస్టేబుల్ ఉద్యోగానికి( Constable Job ) ఎంపికయ్యాడు.అతని తమ్ముడు వినేష్( Vineesh ) నేవీ ఉద్యోగానికి( Navy ) ఎంపికయ్యాడు.

ఇటివలే వినేష్ నియామక పత్రాన్ని అందుకోవడం గమనార్హం.అన్న రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడే ఉద్యోగం చేస్తుండగా తమ్ముడు దేశ రక్షణ దళంలో పని చేస్తున్నారు.

Advertisement

ఒకే సమయంలో ఇద్దరు కొడుకులు మంచి ఉద్యోగాలను సాధించడంతో తల్లీదండ్రుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

ప్రజలకు సేవ చేసే ఉద్యోగాలలో ఉన్న వీళ్లిద్దరూ తమ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని చెబుతున్నారు.లక్ష్మీరాజు, వినేశ్ సక్సెస్ స్టోరీ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.లక్ష్మీరాజు, వినేశ్ కెరీర్ పరంగా మరింత ఎత్తుకు ఎదిగి ఎన్నో విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

వీళ్లిద్దరి సక్సెస్ ను( Success ) ఎంత ప్రశంసించినా తక్కువేనని చెప్పవచ్చు.

లక్ష్మీరాజ్, వినేశ్ బాల్యం నుంచి అద్భుతంగా చదివేవారని తెలుస్తోంది.చదువులో వీళ్లిద్దరూ మంచి ర్యాంకులు సాధించేవారని సమాచారం అందుతోంది.తమ కష్టానికి తల్లీదండ్రుల సహాయసహకారాలు తోడు కావడంతో వీళ్లిద్దరికీ సులువుగా సక్సెస్ దక్కిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానం... వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్!
ఒలంపిక్ పతకాలలో నిజంగా బంగారం ఉంటుందా..? లేదా..?

లక్ష్మీరాజ్, వినేష్ చదువు విషయంలో ఒకరికొకరు సహాయసహకారాలు అందించుకున్నారని సమాచారం అందుతోంది.ఎంతోమందికి స్పూర్తిగా నిలిచిన ఈ అన్నాదమ్ముళ్లు భవిష్యత్తులో భారీ సక్సెస్ లను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు