మెగా చిన్న కోడలు తల్లి కాబోతోందా... వైరల్ అవుతున్న లావణ్య లేటెస్ట్ ఫొటోస్!

సినీనటి లావణ్య త్రిపాఠి ( Lavanya Tripati ) మెగా కోడలిగా అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే ఈమె అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్గా వచ్చారు.

ఇలా తెలుగులో వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ ( Varun Tej ) తో కలిసి రెండు సినిమాలలో నటించారు.

అయితే ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడటం పెద్దల సమక్షంలో వీరిద్దరు గత ఏడాది ఇటలీలో ఎంతో ఘనంగా వివాహం చేసుకోవడం జరిగింది.ఇలా లావణ్య వరుణ్ సందేశ్ ప్రస్తుతం తమ వైవాహిక జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.

ఇక పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి పలు సినిమాలకు కమిట్ అయ్యారని తెలుస్తుంది.కానీ ఈమె నటించిన సినిమాలు ఇప్పటివరకు ప్రేక్షకుల ముందుకు రాలేదు.ఇక వరుణ్ తేజ్ మాత్రం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం ఈయన మట్కా సినిమా( Matka Movie ) షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు.ఇదిలా ఉండగా ఇటీవల కాలు ఫ్యాక్చర్ కావడంతో ఇంటికే పరిమితమైన లావణ్య త్రిపాఠి ఇప్పుడు ఆరోగ్యం కాస్త స్థిమితంగా ఉండడంతో ఈమె తన భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని( Tirumal Srivaaru ) దర్శించుకున్నారు.

Advertisement

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు ఈ ఫోటోలపై వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.ఈ ఫోటోలలో లావణ్య త్రిపాటి బేబీ బంప్ ( Baby Bump ) కనిపిస్తున్న నేపథ్యంలో ఈమె త్వరలోనే తల్లి కాబోతుందని ఈ వార్తలను వైరల్ చేస్తున్నారు.ఇలా త్వరలోనే మెగా ఇంటికి మరో బుల్లి వారసుడు రాబోతున్నారంటూ అభిమానులు లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ కి సంబంధించిన ఈ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.

మరి నిజంగానే లావణ్య త్రిపాఠి తల్లి కాబోతున్నారా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు