ప్రభాస్ 'ఆదిపురుష్' రావణ్ పాత్రపై లేటెస్ట్ అప్డేట్ !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరసపెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే సలార్, ఆది పురుష్ సినిమాలు ప్రకటించి ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభించేసారు.సలార్ సినిమాను కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుంటే.

ఆదిపురుష్ సినిమాను ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.ఆదిపురుష్ సినిమా రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతుంది.

ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తున్నారు.ప్రస్తుతం ముంబైలోని ఒక ప్రైవేట్ స్టూడియోలో ఆదిపురుష్ షూటింగ్ జరుగుతుంది.తాజాగా ఈ సినిమాలో రావణుడి పాత్రపై లేటెస్ట్ అప్డేట్ వచ్చింది.

Advertisement

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.అయితే త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభిస్తారట.

ఆదిపురుష్ షూటింగ్ ను హైదరాబాద్ లో చేయాలనీ అనుకున్నారు.ఇంతలోనే కరోనా సెకండ్ వేవ్ రావడంతో ఇప్పటి వరకు స్టార్ట్ చెయ్యలేదు.

హైదరాబాద్ లో జరిగే షెడ్యూల్ పూర్తి అయితే ఈ సినిమా చాలా భాగం పూర్తి అవుతుందట.అయితే ఈ షెడ్యూల్ కంటే ముందు ముంబైలో మరొక చిన్న షెడ్యూల్ స్టార్ట్ చెయ్యాలని చిత్ర యూనిట్ అనుకుంటున్నారని సమాచారం.

ఈ షెడ్యూల్ లో రావణుడి పాత్రలో నటిస్తున్న సైఫ్ అలీఖాన్ పైనే షూట్ మొత్తం ఉంటుందట.ఈయన పాత్ర హీరోకు ధీటుగా ఉంటుందట.అయన పాత్రకు సంభందించిన కీలక సన్నివేశాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్ లో షూట్ చేయబోతున్నారని తెలుస్తుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఈ షూటింగ్ అయిపోగానే చిత్ర యూనిట్ మొత్తం హైదరాబాద్ చేరుకొని ఇక్కడ షెడ్యూల్ మొదలు పెడతారని టాక్.

Advertisement

తాజా వార్తలు