చాలా వరకు దేశంలో రాష్ట్రాలలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతూ ఉన్నాయి.శీతాకాలం కావడంతో మొన్నటి వరకు భారీగా కేసులు నమోదైన గాని ప్రస్తుతం మాత్రం అన్ని రాష్ట్రాలలో కరోనా కంట్రోల్ లోకి వచ్చినట్లు సమాచారం.
ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా కేసులు చాలా వరకు కంట్రోల్ లోకి వచ్చినట్లు తగ్గుముఖం పట్టినట్లు తెలంగాణ ఆరోగ్య శాఖ విడుదల చేస్తున్న కరోనా హెల్త్ బులిటెన్ లో బయటపడుతున్న లెక్కల బట్టి తెలుస్తోంది.
కాగా తాజాగా గడచిన 24 గంటల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తే 99 కేసులు నమోదు కావడం జరిగింది.
మొత్తం కొత్తగా నమోదైన కేసుల తో కలిపి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 2,96,673కి చేరింది.ఇందులో డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,93,379.
దీంతో ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న కేసుల సంఖ్య చూసుకుంటే 1676.ఈ క్రమంలో రాష్ట్రంలో కారణాలవలన ఇద్దరు మృతి చెందటంతో తెలంగాణలో కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 1618కి చేరింది.