కనీసం ప్రభాస్ కి అయిన జగన్ మద్దతు లభిస్తుందా.. ఏం జరగనుంది?

ఏపీ లో ఎన్నో చర్చల తర్వాత టికెట్ వ్యవహారంలో ఇటీవలే జగన్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే.

ఈ మధ్యనే జగన్ తో సినీ పెద్దలు భేటీ అయినా విషయం తెలిసిందే.

ఈ భేటీ అయినా తర్వాత జగన్ సానుకూలంగా స్పందించారని అందరు తెలిపారు.మరి ఈ భేటీకి వెళ్లిన సభ్యుల్లో ప్రభాస్ కూడా ఉన్న విషయం తెలిసిందే.

ఈ భేటీలో సినిమా టికెట్ ధరల పెంపు, ఇంకా ఐదవ షో కోసం సానుకూలంగా స్పంధించింది.రెమ్యునరేషన్ మినహా 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కే సినిమాలను ప్రత్యేకంగా చూస్తామని జగన్ తెలిపారు.అయితే ఈ భేటీ జరిగి కూడా చాలా రోజులు అవుతున్న ఇంకా జీవో మాత్రం సరికాలేదు.

వచ్చే వారం ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.మరి ప్రభాస్ కి అయినా జగన్ మద్దతు లభిస్తుందా లేదా భీమ్లా నాయక్ లాగానే సరిపెట్టుకోవాలా అనే విషయంపై ఇప్పుడు చర్చ జరుగుతుంది.

Advertisement

రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.ప్రభాస్ ను వెండి తెర మీద చూడక దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది.

అందుకే రాధేశ్యామ్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో వరుస ఇంటర్వ్యూలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు మేకర్స్.ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో చేస్తున్నారు.మరి ఈ సినిమా రిలీజ్ సమయానికి కొత్త జీవో వస్తుందో లేదో వేచి చూడాలి.

కొత్త జీవో కనుక వస్తే ప్రభాస్ కు కలిసి వస్తుంది.ఇకపోతే కలెక్షన్స్ మీద దెబ్బ పడే అవకాశం ఉంది.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు