టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ ని సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు శ్రీకాంత్ (Srikanth) ఒకరు.అద్భుతమైనటువంటి సినిమాలలో నటించి నటుడిగా ఎంతో మంచి ప్రేక్షకాభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇలా నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఈయనకు హీరోగా సినిమా అవకాశాలు రాకపోవడంతో ప్రస్తుతం క్యారెక్టర్ స్థిరపడిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం శ్రీకాంత్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
తాజాగా ఈయన కోటబొమ్మాలి పిఎస్ (Kotabommali PS) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఇక త్వరలోనే దేవర, గేమ్ చేంజర్ వంటి సినిమాల ద్వారా కూడా ఈయన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

ఇక కోటబొమ్మాలి పిఎస్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన శ్రీకాంత్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈయన ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరైన సంగతి తెలిసిందే.అయితే ఈ ఇంటర్వ్యూలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇందులో భాగంగా ఈయన కూడా రైతు బిడ్డనే అంటూ తన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి కొన్ని విషయాలను వెల్లడించారు తన తాతయ్య వాళ్ళు మా నాన్న వాళ్లు చిన్నప్పుడే కర్ణాటక( Karnataka ) వెళ్లిపోయారట నేను కర్ణాటకలోనే జన్మించానని శ్రీకాంత్ తెలిపారు.

మాది వ్యవసాయ ఆధారిత కుటుంబం అందుకే ఎక్కడైతే నీళ్లు ఉంటాయో అక్కడికే రైతులు వెళ్లేవారు అలా మా తాతయ్య వాళ్ళు మా నాన్న వాళ్ళని తీసుకొని కర్ణాటక వెళ్ళిపోయారని మేము కూడా అక్కడే జన్మించామని తెలిపారు.మా నాన్న బాగా వ్యవసాయ పనులు చేసే వారు నాన్నతో పాటు నేను కూడా పొలం పనులు( Farming ) బాగా చేసే వాడిని ఇప్పటికి నాకు వ్యవసాయ పనులన్నీ కూడా వచ్చు అంటూ శ్రీకాంత్ తెలిపారు.డిగ్రీ వరకు నాన్నతో పాటు పొలం పనులకు వెళ్లే వాళ్ళమని పొలం అంత చేతికి వచ్చిన తర్వాత కలం లోకి వెళ్లి ధాన్యానికి కాపలా కూడా కాసే వాళ్ళం అంటూ ఈ సందర్భంగా తన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి తెలిపారు.

ఇక డిగ్రీ పూర్తి అయిన తర్వాత తాను సినిమా రంగం వైపు అడుగులు వేశాను తన తమ్ముడు యుఎస్ వెళ్లి ఎంఎస్ చదవాలని అయితే మేము ఇలా ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు తమ్ముడు అమెరికా వెళ్ళినప్పుడు నాన్న జీరో అయ్యారు ఇండస్ట్రీలో నేను వచ్చిన తర్వాత మొదటి నుంచి నా కెరియర్ ప్రారంభించానని తెలిపారు.ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నాకు సినిమాలు తప్ప మరేది తెలియదని నేను ఇతర వ్యాపారాలు కూడా ఏమీ చేయడం లేదని సినిమాలు మాత్రమే నా వృత్తి అంటూ ఈయన తెలియజేశారు.ఇకపోతే శ్రీకాంత్ కూడా ఒక రైతు బిడ్డ( Rythu Bidda ) అనే విషయం తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు ఈయనని చూస్తే అసలు అలా అనిపించడని భారీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వ్యక్తిలా అనిపిస్తారు అంటూ పలువురు ఈయన వ్యాఖ్యలపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.







