బుల్లితెర జబర్దస్త్ కామెడీ షోతో సార్ కమెడియన్ గా నిలిచిన హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఎందుకంటే తన కామెడీ పంచ్ లతో ఓ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు.
విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు.బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా తన నటనేంటో నిరూపించాడు.
పలు సినిమాలలో నటించిన హైపర్ ఆదికి మంచి గుర్తింపు అందింది.ఇక తన స్కిట్ లో భాగంగా డైలాగ్స్ తో బాగా రెచ్చిపోతున్నాడు.
అప్పుడప్పుడు ఇతరులను ఉద్దేశిస్తూ పంచ్ లు వేస్తాడు.ఇక జబర్దస్త్ లో ప్రతి వారం ఎవర్నో ఒకర్ని గెస్ట్ గా పరిచయం చేస్తాడు.
ఒక జబర్దస్త్ లోనే కాకుండా మరిన్ని షోలతో కూడా బాగా బిజీ గా మారాడు హైపర్ ఆది.ఈటీవీలో ప్రసారమవుతున్న డాన్స్ షో ఢీ లో టీమ్ లీడర్ గా చేస్తున్నాడు.అంతేకాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో కూడా చేస్తున్నాడు హైపర్ ఆది.ఇక ఈ షో లలో హైపర్ ఆది చేసే సందడి అంతా ఇంతా కాదు.తన కామెడీతో బాగా నవ్విస్తూ ఉంటాడు.ఇక ఇప్పటి వరకు పెళ్లి చేసుకోని ఆది పెళ్లి విషయంలో కూడా అవతలి వారి నుండి పంచ్ లు ఎదుర్కొంటాడు.
అంతేకాకుండా అమ్మాయిలతో బాగా కనెక్ట్ అవుతుంటాడు.ఇదిలా ఉంటే తాజాగా ఓ అమ్మాయికి లవ్ లెటర్ రాశాడు ఆది.
తాజాగా ఢీ కింగ్ వర్సెస్ క్వీన్స్ ప్రోమో విడుదల కాగా అందులో సుడిగాలి సుధీర్, హైపర్ ఆది తమ పర్ఫామెన్స్ తో బాగా ఆకట్టుకున్నారు.ఇక ఇందులో సుడిగాలి సుధీర్, రష్మీ ఒక జంట అయితే హైపర్ ఆది, దీపిక పిల్లి మరో జంట.ఇక ఆది, సుధీర్ లకు లవ్ లెటర్ రాయమని టాస్క్ ఇవ్వగా హైపర్ ఆది దీపికను ఉద్దేశిస్తూ.‘దీపికా దీపికా నీ గురించి రాయడానికి నాకు లేదు ఓపిక’ అని రాసిన వెంటనే ప్రియా.నిన్ను చూడగానే పడిపోయా అని జడ్జి ప్రియమణికి కూడా రాశాడు.ఇక ఆది రాసిన లెటర్ కి బాగా నవ్వులు పండాయి.