లాక్‌ డౌన్‌ పొడగింపుతో టాలీవుడ్‌ పరిస్థితి ఏంటీ?

అనుకున్నట్లుగానే లాక్‌డౌన్‌ను ఈనెల చివరి వరకు కేసీఆర్‌ ప్రభుత్వం పొడగించింది.దాంతో తెలుగు సినిమా పరిశ్రమ మరో రెండు వారాల పాటు బంద్‌ అవ్వాల్సిందే.

 Lock Down Effect On Tollywood Industry, Tollywood, Cinima Producers, Prabhas, Co-TeluguStop.com

షూటింగ్‌లతో పాటు కనీసం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా జరిగే పరిస్థితి లేదు.దాంతో సినీ కార్మికులు వేల మంది కూడా తీవ్ర అవస్థల పాలు అవుతున్నారు.

ముఖ్యంగా డైలీ లేబర్‌ నుండి ప్రొడక్షన్‌ క్రూ వరకు కూడా చాలా మంది కూడా డైలీ జీతంతో బతుకుతున్నారు.నెలవారి జీతంతో పని చేసే వారికి కూడా ప్రస్తుత సమయంలో చెల్లించే పరిస్థితి లేదు.

Telugu Corona, Dussara, Prabhas, Theaters, Tollywood-Movie

ఇక సినిమాల షూటింగ్స్‌ ఆగిపోవడంతో ఎన్నో సినిమాలు విడుదల వాయిదా పడే అవకాశం ఉంది.ఇప్పటికే పలు సినిమాలు వాయిదాలు పడ్డాయి.ఈ ప్రభావం ఆగస్టు, సెప్టెంబర్‌లో రావాల్సిన సినిమాలపై కూడా పడుతుందని విశ్లేషిస్తున్నారు.దసరా సినిమాలు కూడా డేట్లు మార్చుకోవాల్సి రావచ్చు అంటున్నారు.ప్రభాస్‌ ప్రస్తుతం నటిస్తున్న సినిమా దసరాకు రావాల్సి ఉండగా లాక్‌ డౌన్‌ పొడగించిన నేపథ్యంలో సినిమా విడుదలపై ఇప్పుడు నీళి మేఘాలు కమ్ముకున్నాయి.

ఇక నిర్మాతలకు కోట్లల్లో నష్టం వాటిల్లబోతుంది.

ఇప్పటికే విడుదల కావాల్సిన సినిమాలు అన్ని కూడా అలాగే ల్యాబ్‌ కుపరిమితం అయ్యి ఉన్నాయి.సినిమా షూటింగ్స్‌ జరుగక పోవడంతో స్టార్స్‌ డేట్లు అన్ని కూడా వృదా అవుతాయి.

దాంతో ఏం చేయాలో పాలుపోక నిర్మాతలు జుట్టు పీక్కుంటున్నారు.థియేటర్లు కూడా ఓపెన్‌ అయ్యే పరిస్థితి లేదు.కనుక థియేటర్ల యాజమానులకు కూడా ఆర్థిక కష్టాలు తప్పవంటున్నారు.మొత్తానికి లాక్‌ డౌన్‌ పొడగింపు తెలుగు సినిమాకు పెద్ద సంక్షోభంను సృష్టించబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube