Junior NTR : యంగ్ టైగర్ దేవర ఓవర్సీస్ హక్కులు అన్ని రూ.కోట్లా.. తారక్ కెరీర్ లో హైయెస్ట్ అంటూ?

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

 Latest Devara Overseas Rights Sold At Huge Price-TeluguStop.com

ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ ఈ సినిమాతో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుని తెచ్చుకోవడంతో పాటు తనకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని మరింత పెంచుకున్నారు.కాగా ప్రస్తుతం తారక్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర ( devara )సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు.

ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్( Janhvi Kapoor ) హీరోయిన్ గా నటిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కూడా మొదలైన విషయం తెలిసిందే.ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి.ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఇకపోతే ఈ మధ్యకాలంలో తరచూ ఈ సినిమాకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి.అందులో భాగంగానే తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ హక్కులకు సంబంధించి పలు రకాల వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కాగా దేవర మూవీ ఏప్రిల్ 5న ఆడియన్స్ ముందుకి రానుంది.

అయితే ఈ మూవీ ఓవర్సీస్ హక్కులు తాజాగా రూ.27 కోట్ల భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.కాగా ఆర్ఆర్ఆర్ తరువాత గ్లోబల్ స్టార్ గా ఎన్టీఆర్ కు క్రేజ్ విపరీతంగా పెరగడంతో పాటు ఈ మూవీ పై హైప్ కూడా బాగా ఉండడంతో మంచి టాక్ వస్తే ఆ మొత్తాన్ని దేవర వేగంగా రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు.

ఇంకా ముందు ముందు ఈ సినిమా ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube