మనవరాళ్లతో మెగాస్టార్ చిరంజీవి ఫోటో వైరల్.. క్లీంకార ఫేస్ ను అలా రివీల్ చేయడంతో?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi )గురించి మనందరికీ తెలిసిందే.తాజాగా చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం భారత రరెండో అత్యున్నత అవార్డు అయిన పద్మ విభూషణ్ ( Padma Vibhushan )ప్రకటించిన విషయం తెలిసిందే.

 Megastar Chiranjeevi Cute Photo With His All Grand Daughter Shared By Upasana, C-TeluguStop.com

దీంతో నిన్నటి రోజున సోషల్ మీడియా టాలీవుడ్ ఇలా ఎక్కడ చూసినా కూడా చిరంజీవి పేరు మారుమోగిపోయింది.అభిమానులు రాజకీయ నాయకులు సెలబ్రిటీలు చిరంజీవి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు.

మెగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చిరంజీవికి స్పెషల్ గా విషెష్ చెప్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.

ఈ నేపథ్యంలో రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల( Upasana Konidela ) ఒక ఆసక్తికర ఫోటోని షేర్ చేస్తూ చిరంజీవికి స్పెషల్ విషెష్ తెలిపింది.మెగాస్టార్ తన మనవాళ్లతో కలిసి దిగిన ఫోటోని ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఈ ఫొటోలో చిరంజీవి కూర్చొని ఉంటే చుట్టూ ఆయన మనవరాళ్లు ఉన్నారు.

పెద్ద కూతురు సుష్మిత ఇద్దరు పిల్లలు, చిన్న కూతురు శ్రీజ ఇద్దరు పిల్లలతో పాటు రామ్ చరణ్ కూతురు క్లీంకార కూడా ఉంది.క్లీంకార ( Klinkara )చిరంజీవి ఆయన ఒళ్ళో కుర్చోపెట్టుకున్నారు.

ఇలా తన అయిదుగురు మనవరాళ్లతో మెగాస్టార్ క్యూట్ ఫోటో దిగారు.ఈ ఫోటో ఇటీవల బెంగుళూరులో సంక్రాంతికి చేసుకున్న సెలబ్రేషన్స్ టైంలో తీసినట్టు తెలుస్తుంది.

ఉపాసన ఈ ఫోటోని షేర్ చేసి.మీరు చూస్తుంది ఒక శక్తివంతమైన పిడికిలి నుంచి అయిదు వేళ్ళు.సినిమా పరంగానే కాదు ఒక నాన్నగా, ఒక మామగా, ఒక తాతగా మీరు మాకు స్ఫూర్తి.మీకు పద్మ విభూషణ్ వచ్చినందుకు అభినందనలు అంటూ పోస్ట్ చేసింది.

అయితే ఈ ఫొటోలో అందరి మనవరాళ్ల ఫేస్ లు చూపించి ఎప్పటిలాగే క్లీంకార ఫేస్ పూర్తిగా కనపడకుండా బ్లర్ చేశారు.దీంతో ఈసారి కూడా క్లీంకార ఫేస్ పూర్తిగా చూద్దామనుకున్న మెగా ఫ్యాన్స్ ఆశ నిరాశ అయింది.

ఇంకెప్పుడు క్లిన్ కారా ఫేస్ చూపిస్తారు అని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube