ప్రశాంత్ వర్మ.(Prasanth Varma) ఈ పేరు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువుగా వినిపిస్తుంది.
ఈయన బాలయ్య అన్ స్టాపబుల్ 2 టీజర్ కు దర్శకత్వం వహించినప్పటి నుండి ఈయన టాలెంట్ గురించి అందరు చెప్పుకుంటున్నారు.మరి అప్పటి నుండి ఈయన స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి.
ఒకానొక సమయంలో బాలయ్యకు స్టోరీ చెప్పి గ్రీన్ సిగ్నల్ కూడా తీసుకున్నాడని టాక్ వచ్చింది.
మరి ఏకంగా బాలయ్యతో(Balakrishna) సినిమా అనేసరికి ఈయన పేరు మారుమోగి పోయింది.
బాలకృష్ణ అన్ స్టాపబుల్ టీజర్ లో తనని బాగా చూపించడంతో ఈయనకు కూడా ప్రశాంత్ వర్మ వర్క్ నచ్చింది అని అప్పట్లో టాక్ రావడంతో వీరి కాంబో ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యింది అని అంతా అనుకున్నారు.అయితే ఈ కాంబో ఎప్పుడు ఉంటుందో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఈయన మరో స్టార్ హీరోను లైన్లో పెట్టినట్టు తెలుస్తుంది.
మాస్ మహారాజా రవితేజ(Raviteja) ప్రెజెంట్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.ఈ క్రమంలోనే రవితేజను ప్రశాంత్ వర్మ లైన్లో పెట్టినట్టు టాక్ వస్తుంది.వీరిద్దరి కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ రానుందని అందుకు సంబంధించిన కథపై ప్రెజెంట్ చర్చలు కూడా జరుగుతున్నాయని రూమర్స్ వినిపిస్తున్నాయి.మరి ఈయన ఈ ఇద్దరి హీరోల్లో ఎవరో ఒకరితో అయితే సినిమా తీసే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తుంది.
చూడాలి ఏం జరుగుతుందో.ఇక ప్రెజెంట్ ఈ ఇద్దరు హీరోలు కూడా వారి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.బాలయ్య ప్రెజెంట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమా చేస్తుంటే.రవితేజ రావణాసుర సినిమాను రిలీజ్ కు రెడీగా ఉంచాడు.అలాగే ప్రస్తుతం తన మొదటి పాన్ ఇండియన్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు.వంశీ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వరరావు సినిమా చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.