విజయవాడ దుర్గగుడి వద్ద విరిగిపడిన కొండచరియలు.. తప్పిన ముప్పు

విజయవాడ దుర్గగుడి వద్ద పెను ప్రమాదం తప్పింది.ఇంద్రకీలాద్రికి దిగువన ఉన్న కేశఖండన శాల పక్కన కొండ చరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి.

సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.అటు ఆలయ ఈవో, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారని తెలుస్తోంది.

నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి.అయితే ప్రాణనష్టం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

కాగా ఈ ప్రమాదంలో మూడు బైకులు ధ్వంసం అయ్యాయని సమాచారం.

Advertisement
ఆ డైరెక్టర్ డైరెక్షన్ లో నటించాలని ఆశ పడుతున్న రిషబ్ శెట్టి.. కోరిక తీరుతుందా?

తాజా వార్తలు