లాలూ కుటుంబంలో ఆమె రాక‌తో క‌లిసొచ్చిందంట‌..!!

ఇబ్బందుల్లో ఉన్న‌ప్పుడు ఇంట్లోకి కొత్త‌గా కోడ‌లు వ‌చ్చినా.ఇంట్లో ఆడ‌పిల్ల పుట్టినా ఆ త‌ర్వాత ప‌రిస్థితులు మారిపోతే వారి వ‌ళ్లే క‌లిసొచ్చింద‌ని చెబుతుంటారు.వాళ్ల‌ను తెగ పొగిడేస్తుంటారు.ఇక అంతా మంచే జ‌రుగుతుంద‌ని న‌మ్ముతారు.ప్ర‌స్తుతం బిహార్ ఆర్జేడీ అధినేత లాలూ ప్ర‌సాద్ ఇంట ఇదే ముచ్చ‌ట వినిపిస్తోంది.లాలూ కోడ‌లు త‌మ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత ప‌రిస్థితుల‌న్నీ చ‌క్క‌బ‌డి అన్ని ర‌కాలుగా క‌లిసి వ‌స్తుంద‌ని అంటున్నారు.

 Lalu Prasad Yadav Lucky Charm Daughter In Law Rajasri Joined The Family Details,-TeluguStop.com

దీంతో అదృష్టవంతురాలిగా మారింది లాలూ కోడలు.దీర్ఘ కాలం తర్వాత అనూహ్యంగా అధికారం చేతికి వచ్చిన లాలూ కుటుంబానికి కారణం.లక్కీ చామ్ అయిన కోడలి పుణ్యమేనని లాలూ ఫ్యామిలీ తెగ సంబ‌ర‌ప‌డుతోంద‌ట‌.

అధికారం.బెయిల్

అకస్మాత్తుగా బీజేపీకి హ్యాండిచ్చి.కొత్త మిత్రులతో చేతులు కలిపిన నితీశ్.

ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన 24 గంటలు తిరగకుండానే మళ్లీ సీఎం కుర్చీలో కూర్చోవటం తెలిసిందే.ఈ మొత్తం ఎపిసోడ్ లో నితీశ్ కుర్చీలో మార్పు లేకపోయినా.

లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టటం తెలిసిందే.

Telugu Bihar, Laluprasad, Nithish Kumar, Rajasri, Tejasvi Yadav-Political

అయితే.దీనంతటికి కారణం.ఆయన సతీమణి.

చిరకాల స్నేహితురాలు రాజశ్రీ అకా రాచెల్ కారణమని లాలూ కుటుంబం భావిస్తోంద‌ట‌.ఆమెను 2021 డిసెంబరు 10న తేజ‌స్వీ యాద‌వ్ పెళ్లి చేసుకున్నారు.

ఈ పెళ్లి జరిగిన తొమ్మిది నెలలకే తేజస్వీ యాదవ్ మరోసారి ఉప ముఖ్యమంత్రి కావటం.అనారోగ్యానికి గురైన లాలూ ప్రసాద్ యాదవ్ కోలుకోవ‌డం.

బెయిల్ కూడా వచ్చేయడం లాంటివన్నీ చోటు చేసుకున్నాయని చెబుతున్నారు.

Telugu Bihar, Laluprasad, Nithish Kumar, Rajasri, Tejasvi Yadav-Political

అయితే ఇన్ని విశేషాలు రాజశ్రీ ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాతే జరిగినట్లుగా లాలూ ఫ్యామిలీతో పాటు ఆర్జేడీ కార్యకర్తలు భావిస్తున్నార‌ట‌.మొత్తంగా లాలు కుటుంబానికి రాజశ్రీ లక్కీగా మారిందన్న ప్రచారం బిహార్ లో జోరుగా సాగుతోంద‌ట‌.కాగ 2005లో పవర్ నుంచి దూరంగా ఉన్న ఆర్జేడీకి 2015లో పద్దెనిమిది నెలలు మాత్రం అధికారంలో ఉంది.

అప్పట్లో తేజస్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తే.అతని సోదరుడు మంత్రిగా వ్యవహరించారు.

ఆ తర్వాత నుంచి వారు అధికారానికి దూరమయ్యారు.తాజాగా మళ్లీ అధికారం ద‌క్క‌టం అంతా రాజశ్రీ రాక‌తోనే అని భావిస్తున్నార‌ట‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube