పాత సామెతే.అన్ని దానాలలో కెల్లా అన్న దానం మిన్న అని చాలా మంది చెబుతుంటారు.
అలాంటిది మరి తల్లిపాలు దానం అంటే మామూలు సంగతి కాదు కదా.వినడానికి ఆశ్చర్యంగా ఉన్న తల్లిపాలు దానం చేయాలంటే ఎంతో పెద్ద మనసు ఉండాలి.కాని, ఆ పని చేయరు.దానం అంటే కేవలం డబ్బులు, దుస్తులు మాత్రమే కాదు ఎవరికి తోచిన విధంగా వారు చేతనైన సహాయం చేసిన దానిని దానం అనే అంటారు.
కాకపోతే కొత్తగా ఓ నిర్మాత తన పాలని దానం చేయడం ఇప్పుడు ఓ విశేషంగా మారింది.ప్రపంచానికి డబ్బా పాల కంటే తల్లిపాలు ఎంతో బలాన్ని చేకూరుస్తాయి అన్న విషయాన్ని తెలియజేసేందుకు ఈ ప్రయత్నం చేసింది.
డబ్బా పాల కంటే అమ్మ పాలు పిల్లలకు ఎంతో బలాన్ని చేకూరుస్తాయి అలాగే మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయనీ ఆవిడ తెలుపుతున్నారు.ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.
బాలీవుడ్ లో సాంద్ కి ఆంక్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన నిధి పర్మర్ హిర నందిని అనే 42 ఏళ్ల మహిళ తన పాలను దానం చేసింది.చాలా మంది తల్లులు వారికి ఉన్న కొన్ని ఆరోగ్య సమస్యలు కారణాల వల్ల వారి పిల్లలకు పాలు ఇవ్వలేక పోతున్నారని ఈ ప్రభావం ద్వారా పిల్లల ఎదుగుదల, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఏర్పడుతుందని తెలిపారు.
దీంతో తాను తన చనుబాలను ఎవరైతే తల్లిపాలకు దూరమైన చిన్నారుల కోసం అందించేందుకు ముందుకు వచ్చింది.ఆవిడకు పాలు ఉత్పత్తి అధికంగా ఉండటంతో తన కొడుకు పాలు పట్టిన తర్వాత కూడా మిగిలిపోతుండడంతో ఆవిడ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఆ పాలను ఫ్రిడ్జ్ లో సరిగా స్టోర్ చేస్తే ఆ పాలు మూడు నుంచి నాలుగు నెలల వరకు నిల్వ ఉంటాయి అని కూడా ఆవిడ తెలుపుతోంది.దీంతో ఎవరైనా తల్లులు వారి పాలు ఎక్కువగా ఉంటే వాటిని జాగ్రత్తగా భద్రపరిచి ఎవరికైతే అవసరం ఉన్నవారికి దానం చేయాలంటూ తెలిపింది.

ఈ కారణం చేతనే తాను తన పాలను దానం చేయాలని భావించినట్లు తెలిపింది.అయితే కొందరు ఈ విషయాన్ని ఎగతాళి చేశారు అని.ఎవరిని అడిగినా సరైన సమాధానం చెప్పలేదు అని చెప్పుకొచ్చారు.దీంతో తాను ఆన్లైన్ లో తల్లిపాలకు సంబంధించి తల్లి పాలు డొనేషన్ సెంటర్ల వివరాలు తెలుసుకొని చివరకు ముంబై నగరంలోని సూర్య హాస్పిటల్ లో ఎమర్జెన్సీ వార్డులో ఉన్న పిల్లల కోసం తన పాలను దానం చేయాలని ఆవిడ నిర్ణయం తీసుకుంది.
ఈ సందర్భంగా ఆవిడ మార్చి నెల నుండి ఇప్పటిదాకా ఏకంగా 42 లీటర్ల తల్లిపాలను డొనేట్ చేశారు.ఇకపోతే తన పాలను మీ చిన్నారులు తాగుతున్నారు అన్న విషయంపై ఆవిడ హాస్పిటల్ వెళ్లి చూడగా వారి పరిస్థితిని చూసిన తర్వాత ఆవిడ చలించి పోయి మరో ఏడాది పాటు తాను దానం చేయాలని భావిస్తున్నట్లు ఆవిడ నిర్ణయించుకుంది.
లీటర్ల పాలు తాను దానం చేసినందుకు గాను తాను గొప్పగా ఫీల్ అవుతున్నట్లు తెలిపింది.