లేడీ అమితాబ్ విజయశాంతి కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్లీ తన పుట్టినిల్లయిన.బీజేపీలోకి వచ్చారు.1998 లలో ఆమె బీజేపీ నుంచే రాజకీయాలు ప్రారంభించారు.తర్వాత సొంత పార్టీ పెట్టుకున్నారు.
ఇక, ఆ త ర్వాత దానిని టీఆర్ ఎస్‌లో విలీనం చేసేసి మెదక్ ఎంపీ అయ్యారు.ఇక, ఆ తర్వాత టీఆర్ ఎస్‌తో విభే దించారు.
ఇలా సాగిన ప్రయాణంలో కొంత విరామం తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు.ఇక్కడ పొసగలే దు.స్థానిక కాంగ్రెస్ నేతలకు విజయశాంతికి కూడా తేడా కొట్టింది.అంతా తానే చూసుకుంటానని అందరూ తనమాటే వినాలనే తత్వంతో విజయశాంతి కాంగ్రెస్ నేతలకు దూరమయ్యారు.
ఫలితంగా రాజకీయాల్లో ఐసొలేట్ అయ్యారు.ఎవరూ విజయశాంతిని పట్టించుకోలేదు.ముఖ్యమైన దుబ్బా క ఉప ఎన్నికలో ఆమె టికెట్ ఆశించారని.అయితే.
పార్టీ ఇవ్వలేదని ప్రచారంలో ఉంది.దీంతోనే కీలక మైన గ్రేటర్ ఎన్నికల సమయంలో ఆమె దూరంగా ఉండడంతోపాటు.
పార్టీ మారుతున్నాననే సంకేతాలు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్‌ను నిలువునా ఇబ్బంది పెట్టారు.గ్రేటర్ ప్రచారంలో బీజేపీ విజయశాంతి పేరు ఎత్తకుండానే కాంగ్రెస్ ఖాళీఅవుతోందని ప్రచారం చేసుకుంది.
ఇది బీజేపీకి లాభించింది.తాజాగా విజయశాంతి కమలం గూటికి చేరిపోయారు.

మరి ఇప్పుడైనా.ఇక్కడ నిలదొక్కుకుంటారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది.ఎందుకంటే.ఎక్కడైనా.రాష్ట్ర నేతలతో కలిసి పనిచేయకతప్పదు.కానీ.
విజయశాంతి ఇలా సర్దుకుపోలేక పోవడం.తనకు కూడా కొన్ని ప్రత్యేక ఆలోచనలు ఉన్నాయని వాటిని అమలు చేయాలని ఒత్తిడి తేవడం కింది స్థాకి కేడర్‌కు అందనంత రీతిలో వ్యవహరించడం హైఫై రాజకీయ నేతగా ఉండాలని భావించడం వంటివి ఆమెను అన్ని పార్టీల్లోనూ దూరం పెట్టాయి.
మరి ఇప్పుడు బీజేపీ పరిస్థితి మారలేదు.
నేతలు కూడా తమ ఆలోచనా రీతిని మార్చుకోలేదు.
ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయాలకంటే కూడా జాతీయ రాజకీయాలపై పట్టు పెంచుకుంటేనే బెటర్ అని అంటున్నారు బీజేపీ మేధావులు.అక్కడైతే విజయశాంతికి ఇబ్బంది ఉండే అవకాశం లేదని చెబుతున్నారు.మరి లేడీ అమితాబ్ ఏం చేస్తారో చూడాలి.