బాబు కి పవన్ .. జగన్ కి ముద్రగడ ? అంతేనా ?

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం టిడిపి అధినేత చంద్రబాబుకు లేఖ రాశారు .కొద్ది రోజుల క్రితం చంద్రబాబు కు శాసనసభలో జరిగిన అవమానంపై కన్నీటి పర్యంతం అయిన సంఘటనలో ఆయనకు ఎంత మంది ప్రముఖులు సంఘీభావం ప్రకటించి ఏపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 Pawan Kalyan Has Similar Support For Padmanabhan And The Tdp Which Indirectly Se-TeluguStop.com

ఈ వ్యవహారంతో టిడిపి తోపాటు చంద్రబాబుకు వ్యక్తిగతంగా  బాగానే లబ్ది కలిగింది.  టిడిపి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

ఇది ఇలా ఉంటే,  చంద్రబాబు కన్నీటి వ్యవహారంపై మాజీమంత్రి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు.ఆ లేఖలో ఏపీ ప్రభుత్వ తీరును సమర్డించక పోయినా , చంద్రబాబుకు జరిగిన అవమానాన్ని ప్రస్తావిస్తూ, గతంలో తన కుటుంబం పట్ల చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరును గుర్తు చేశారు.
   నీ పతనాన్ని తాను ఇంకా కోరుకుంటున్నట్లు ప్రకటించారు.  అసలు అసెంబ్లీలో చేసిన శపథం నీటి మీద రాతలే అని, శపదం అంటే ఎన్టీఆర్ , ఇందిరాగాంధీలదే అంటూ సెటైర్లు వేశారు.

ముద్రగడ లేఖ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  ఈ సంగతి పక్కన పెడితే జగన్ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు చంద్రబాబును దూషించడం పై విమర్శలు వస్తున్న సమయంలో ముద్రగడ పరోక్షంగా వైసీపీ కి మద్దతు తెలుపుతున్నట్లు వ్యాఖ్యలు చేశారు.

ఇక ముద్రగడ జగన్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు గానే టీడీపీకి అనుకూలంగా పవన్ కళ్యాణ్ సైతం వ్యవహరిస్తున్నారని,  టీడీపీ కి  పరోక్షంగా పవన్ మద్దతుగా నిలబడతారని , 2014 లో టిడిపి బీజేపీలకు మద్దతు ఇచ్చిన తర్వాత టిడిపి తీసుకున్న ఎన్నో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు విషయంలో పవన్ మౌనంగా ఉండిపోయారు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
 

Telugu Chandrababu, Janasenani, Kapu, Pavan Kalyan, Ysrcp-Telugu Political News

   అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వై సీపీనే టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేసే వారిని,  2019 లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత టీడీపీకి అనుకూలంగా ఆయన ప్రసంగాలు,  మద్దతు ఉంటూ వస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.జగన్ కు ముద్రగడ అస్త్రం పనిచేస్తుండగా,  చంద్రబాబు కు పవన్ కళ్యాణ్ అస్త్రం పని చేస్తోంది అనే సెటైర్లు ఏపీలో మొదలయ్యాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube