టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన రమణకు అదృష్టం పట్టుకుంది.అందుకోసమే వచ్చిన వెంటనే ఆయనకు స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కిందని అందరూ అంటున్నారు.
ఈ సందర్భంలో ఆయన ఓ అరుదైన ఘనతను అందుకున్నారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మూడు చట్ట సభలకు ఎన్నికైన ఏకైక వ్యక్తిగా ఎల్.రమణ నిలిచారు.టీడీపీ హయాంలో ఆయన ఎంపీగా, ఎమ్మెల్యేగా పని చేశారు.
ఇక ఇప్పుడు రమణ శాసన మండలిలో కూడా అడుగు పెట్టబోతున్నారు.టీడీపీ హయాంలో రమణ ఒక వెలుగు వెలిగారు.
కానీ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మాత్రం రమణ గ్రాఫ్ తగ్గుకుంటూ వెళ్లింది.ఆయన టీడీపీ తెలంగాణ శాఖకు అధ్యక్షుడిగా వ్యవహరించినా కూడా ఆయన్ను ఎవరూ సరిగ్గా గుర్తించలేకపోయారు.
టీడీపీలో ఉన్న అందరు నాయకులు తలో దిక్కుకు వెళ్లిపోయిన కానీ ఎల్.రమణ మాత్రం టీడీపీలోనే కొనసాగారు.
కానీ మొన్నీ మధ్యే ఆయన కూడా కండువా మార్చారు.వెంటనే ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.ఇక మరో విషయం ఏమిటంటే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న జగిత్యాలకు చెందిన మరో నాయకుడు జీవన్ రెడ్డి కూడా ఎమ్మెల్సీగా శాసన మండలిలోనే కొనసాగుతున్నారు.ఇలా ఒకే ప్రాంతానికి చెందిన వారు శాసన మండలిలో ఉండడం చాలా అరుదు.

పైగా జీవన్ రెడ్డి రమణ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా నిలబడే వారు.ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ఎల్.రమణ చంద్రబాబు హయాంలో ఒకసారి మంత్రిగా కూడా సేవలందించాడు.టీడీపీకి చెందిన కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తో సహ పలువురు నాయకులు ప్రస్తుతం టీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు.
ఇక ఇప్పటి నుంచి రమణ కూడా కారు గుర్తుపైనే తిరగనున్నారు.